'అరుంధతి' కోడి రామకృష్ణ మరో విజువల్ వండర్ చిత్రం 'నాగభరణం'
'అరుంధతి' చిత్రం తర్వాత దర్శకుడు కోడిరామకృష్ణ తీసిన చిత్రం ''నాగభరణం''. ''అమ్మోరు'', ''అరుంధతి'' వంటి విజువల్ వండర్స్‌ని రూపొందించిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న మర
'అరుంధతి' చిత్రం తర్వాత దర్శకుడు కోడిరామకృష్ణ తీసిన చిత్రం ''నాగభరణం''. ''అమ్మోరు'', ''అరుంధతి'' వంటి విజువల్ వండర్స్‌ని రూపొందించిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న మరో అద్భుతం ఈ చిత్రం. కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌తో క్రియేట్ చేశారు. రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పెన్ మూవీస్, ఇన్‌బాక్స్ పిక్చర్స్, బ్లాక్‌బస్టర్ స్టూడియో పతాకాలపై జయంతి లాల్ గాడా, సాజిద్ ఖురేషి, సొహైల్ అన్సారీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ప్రముఖ నిర్మాత ఙ్ఞానవేల్ రాజా ఈ సినిమా తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ''నాగ భరణం'' పేరుతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నట్లు ఙ్ఞానవేల్ రాజా తెలిపారు. కన్నడ హీరోయిన్ రమ్య ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో దిగంత్, ముకుల్ దేవ్, రవికాలే, అమిత్ తదితరులు వివిధ పాత్రలలో నటించారు. గురుకిరణ్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. తన జీవితాన్ని నాశనం చేసినవారిని శివభక్తురాలు రమ్య 'శివనాగం' రూపమెత్తి పగతీర్చుకునే కథతో దీన్ని రూపొందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.