Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

రాజకీయాల్లోకి రానున్న కీర్తి సురేష్..?

Advertiesment
keerthy suresh
, మంగళవారం, 27 జూన్ 2023 (12:03 IST)
ప్రముఖ నటి కీర్తి సురేష్ రాజకీయాల్లో రానుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహానటిలో సావిత్రిగా కీర్తి అదరగొట్టింది. సావిత్రి పాత్ర పోషించినందుకు ఆమె ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 
 
కీర్తి సురేష్ మూడు SIIMA అవార్డులు, సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. 2021లో ఫోర్బ్స్ ఇండియా, అండర్ 30 జాబితాలో కీర్తి స్థానం పొందింది. కీర్తి సురేష్ ప్రస్తుతం రాబోయే చిత్రం మామన్నన్ కోసం పని చేస్తోంది. 
 
ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వడివేలు కీలక పాత్ర పోషిస్తున్నారు. మామన్నన్ సినిమా జూన్ 29న విడుదల కానుంది. 
 
ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో కీర్తి సురేష్ పాల్గొంటోంది. మామన్నన్ పొలిటికల్ థ్రిల్లర్ అని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాతీయ అవార్డు గ్రహీత రాజకీయ ప్రవేశంపై స్పందించారు. కీర్తి వ్యాఖ్యలతో ఆమె భవిష్యత్తులో రాజకీయ ప్రవేశంపై ఆసక్తి చూపుతోంది. 
 
కీర్తి సురేష్ బీజేపీలో చేరుతోందని సినీ పరిశ్రమలో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలను కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ ఖండించారు. మరి భవిష్యత్తులో కీర్తి సురేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 
 
టాలీవుడ్‌లో, కీర్తి సురేష్ చివరిసారిగా యాక్షన్ డ్రామా దసరాలో మహిళా ప్రధాన పాత్రలో కనిపించింది, దీనిలో ఆమె నేచురల్ స్టార్ నానితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇప్పుడున్న కామెడీ డబ్బా పాలులాంటివి : కోట శ్రీనివాసరావు