కాజల్‌ను ఆశీర్వదిస్తున్న కాషాయ దుస్తుల్లో స్వామీజీ ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ ఎంపికైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో హీరోయిన్ గా నటించింది కాజల్ అగర్వ
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ ఎంపికైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో హీరోయిన్ గా నటించింది కాజల్ అగర్వాల్. తమ్ముడు పవన్‌ని రొమాన్స్ చేసిన ఈ అమ్మడు అన్నయ్య చిరుతో రొమాన్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. చిరు కోసం చాలామంది హీరోయిన్లను పరిశీలించారు.
అయితే రాంచరణ్ ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్‌గా నటింపజేయాలని భావించాడట. రాంచరణ్ తో 'మగధీర', 'నాయక్', 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాలు చేసింది కాజల్ అగర్వాల్. రాంచరణ్ 'ఎవడు' చిత్రంలో గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చింది. ఈ అనుబంధంతో కాజల్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాడట. ఇదిలా ఉంటే... కాజల్ అగర్వాల్, ఓ స్వామీజీకి నమస్కరిస్తుండగా, ఆయన ఆశీర్వదిస్తున్నట్టున్న చిత్రం ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
ఇంతకీ ముఖాన గంధం, కుంకుమ బొట్టుతో, కాషాయ దుస్తుల్లో ఉన్న ఈ స్వామీజీ ఎవరో తెలుసా? దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్. కాజల్ వంగి వినయంగా నమస్కరిస్తుంటే, భక్తి శ్రద్ధలతో ఆశీర్వదిస్తున్నాడు. ఇటీవలే రానా సరసన తొలిసారిగా హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిన కాజల్, కెరీర్‌లో ఫస్ట్ టైమ్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తుండగా, ఆ చిత్రం లొకేషన్ లోనే ఈ ఫోటో తీసినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.