Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకటేష్‌తో కాజల్ అగర్వాల్ చేయడానికి అదే కారణమట...

సినిమాల్లో నటించడమంటేనే ఒక ప్రయోగం. అందులోను కొత్త క్యారెక్టర్లు.. కొత్త వ్యక్తులను కలవడమంటే మరీ ఇష్టం. ఎప్పుడూ ఒకే రకమైన క్యారెక్టర్ చేయడం నాకు ఇష్టం లేదు. అందరు హీరోయిన్లలా నేను ఉంటే నా గొప్పతనం ఏముంటుంది. అందుకే నేను స్పెషల్ అంటోంది కాజల్ అగర్వాల్

Advertiesment
వెంకటేష్‌తో కాజల్ అగర్వాల్ చేయడానికి అదే కారణమట...
, బుధవారం, 3 జనవరి 2018 (19:33 IST)
సినిమాల్లో నటించడమంటేనే ఒక ప్రయోగం. అందులోను కొత్త క్యారెక్టర్లు.. కొత్త వ్యక్తులను కలవడమంటే మరీ ఇష్టం. ఎప్పుడూ ఒకే రకమైన క్యారెక్టర్ చేయడం నాకు ఇష్టం లేదు. అందరు హీరోయిన్లలా నేను ఉంటే నా గొప్పతనం ఏముంటుంది. అందుకే నేను స్పెషల్ అంటోంది కాజల్ అగర్వాల్. ఖైదీ నెంబర్ 150 సినిమాతో మెగాస్టార్‌తో కలిసి సినిమాలు చేసిన తరువాత మరికొన్ని సినిమాల్లో నటించాదామె. అయితే పెద్దగా హిట్లు లేకపోవడంతో హిట్ కోసం ఎదురుచూస్తోంది.
 
తాజాగా తేజ దర్సకత్వంతో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కబోతున్న సినిమాలో కాజల్ నటించనుంది. కాజల్‌ను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది తేజానే. లక్ష్మీకళ్యాణం సినిమాతో కాజల్‌ను తెలుగు సినీపరిశ్రమలోకి తీసుకొచ్చారు తేజ. అందుకే తేజ ఏ సినిమా చేసినా కాజల్ అందులో నటించడానికి  నేను సిద్థంగా ఉన్నానని చెబుతోంది. 
 
తేజ ఎక్కడికి రమ్మన్నా... ఎన్ని రోజులు షూటింగ్ చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను పరిశ్రమకు పరిచయం చేసిందే ఆయనే. తేజ నాకు దైవంతో సమానం. అందుకే వెంకటేష్ సినిమాతో ఇద్దరు పిల్లల తల్లిగా నటించాలని చెప్పినా ఒకే అన్నాను అని చెబుతోంది కాజల్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహజీవనంలో తప్పులేదు.. ప్రేమిస్తే పెళ్లి కాకపోయినా కలిసుండొచ్చు: కత్తి మహేష్