Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పబ్లిక్ ప్లేస్‌లో గర్ల్‌ఫ్రెండ్ సోఫియా రిచీతో రాసలీలల్లో మునిగిన జస్టిన్ బీబర్

జస్టిన్‌ బీబర్‌.. సంగీత ప్రియులకు ఇతడు సుపరిచితుడు. పదమూడేళ్ల వయసులోనే పాప్ సింగర్‌గా ప్రపంచానికి పరిచయమై, సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఇతడు అందరి అభిమానాన్ని చాటుకున్నాడు. అదేస్థాయిలో అపఖ్యాతిని

Advertiesment
Justin Bieber
, సోమవారం, 29 ఆగస్టు 2016 (14:37 IST)
జస్టిన్‌ బీబర్‌.. సంగీత ప్రియులకు ఇతడు సుపరిచితుడు. పదమూడేళ్ల వయసులోనే పాప్ సింగర్‌గా ప్రపంచానికి పరిచయమై, సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఇతడు అందరి అభిమానాన్ని చాటుకున్నాడు. అదేస్థాయిలో అపఖ్యాతిని కూడా మూటగట్టుకున్నాడు. అభిమానులతో పొగడ్తలు కురిపించుకున్నట్లే వారి చీవాట్లు సైతం తిన్నాడు. ఒక్కసారిగా పేరుప్రతిష్టలు మార్మోగడంతో ఈ సింగర్ ఆగలేకపోయాడు. పొగరుగా ప్రవర్తించి తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. 
 
తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. పట్టపగలు పబ్లిక్‌లో తన తాజా గర్ల్‌ఫ్రెండ్ సోఫియా రిచీతో శృంగారం చేస్తున్న ఫోటోలను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దుమారం రేగింది. ఒంటిమీద నూలుపోగు లేకుండా ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులివ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ ఏకాంతంగా గడిపినప్పుడు రాసలీలలో మునిగిపోయినప్పుడు తీసిన ఫోటోలే ఇవని తేలింది. 
 
అయితే బీబర్‌కు ఇదేం కొత్త కాదు. గతంలో కూడా గర్ల్‌ఫ్రెండ్‌, పాప్‌స్టార్‌ సెలెనా గోమెజ్‌తో డేటింగ్‌లో ఉండగా బీబర్‌ను కెనడాలోని బోరంటోలో పోలీసులు అరెస్టు చేసిన సంగతితెలిసిందే. జపాన్‌ నుంచి తిరిగి వస్తున్న అతడిని అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ విమనాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఆతర్వాత బ్రిజిల్‌లోని రియో డి జెనిరోలో వేశ్యగృహంలో బీబర్‌ పట్టుబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బీబర్ పర్సనల్ లైఫ్‌లో ఇలాంటి వివాదాలు ఎన్నో. ఇదంతా జరుగుతున్నా బీబర్‌లో ఎలాంటి మార్పు రాలేదు. పాప్ సింగర్‌గా ఎంత ఫేమస్ అయ్యాడో.. వివాదాలతో కూడా అదే స్థాయిలో ముందుకు దూసుకుపోతున్నాడు ఈ యువ సింగర్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగార్జున బర్త్ డే... ప్రేమమ్ సాంగ్ రిలీజ్... అదరగొట్టిన శ్రుతి హాసన్(Video)