పాయల్ రాజ్ పేరు చెబితే ఏపీలో యూత్ ఊగిపోతుంది. అంటే... ఆమె ఆర్ఎక్స్ 100 చిత్రంలో చూపించిన నటన అలాంటిది మరి.
ఇదిలావుంటే పాయల్ రాజ్ క్రేజ్ దెబ్బకు పలు షాపులు ఆమెతో ప్రారంభోత్సవాలు చేయించుకుంటున్నాయి. పాయల్ వస్తుందనగానే యూత్ అక్కడ వాలిపోతోంది. ఇక షాపులో వున్న వస్తువులు హాట్ కేకులు కాక ఏమవుతాయి?
ఇక అసలు విషయానికి వస్తే... పాయల్ ఇటీవలే చిత్తూరు జిల్లా మదనపల్లిలో సెలెక్ట్ రిటైల్ మొబైల్ షోరూం ప్రారంభోత్సవానికి వెళ్లింది. అక్కడ యూత్‌లో తనకున్న క్రేజ్ చూసి మురిసిపోయిందట. అంతేకాదు... ఇదే బ్రాండును జూ.ఎన్టీఆర్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈమధ్య ఆయనను కలిసి విష్ చేసే అవకాశం దొరికిందట. పనిలో పనిగా యంగ్ టైగర్ పక్కన నటించాలన్న ఆసక్తి వున్నదన్న విషయానికి ఆయనకి చేరవేసిందట. మరి ఎన్టీఆర్ ఏమంటారో చూడాలి. చూడండి ఈ వీడియోను...