Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమ్మేసిన 'ఖైదీ నంబర్ 150'.. కలెక్షన్లు రూ.164 కోట్లు.. వినాయక్‌కు సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌?

దాదాపు దశాబ్ద కాలం తర్వాత వెండి తెరపై మెరిసిన మెగాస్టార్... తన రేంజ్‌కు తగ్గట్టే సత్తా చాటారు. చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ఘన విజయం సాధించి, బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. ముఖ్యంగా కలె

Advertiesment
కుమ్మేసిన 'ఖైదీ నంబర్ 150'.. కలెక్షన్లు రూ.164 కోట్లు.. వినాయక్‌కు సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌?
, గురువారం, 9 మార్చి 2017 (13:09 IST)
దాదాపు దశాబ్ద కాలం తర్వాత వెండి తెరపై మెరిసిన మెగాస్టార్... తన రేంజ్‌కు తగ్గట్టే సత్తా చాటారు. చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ఘన విజయం సాధించి, బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా కుమ్మేసింది. సుమారు తొమ్మిదేళ్ళ తర్వాత వెండితెరపై కనిపించడంతో చిరంజీవిని చూసేందుకు థియేటర్లకు తరలి వచ్చారు. ఫలితంగా ఈ చిత్రం రూ.164 కోట్ల మేరకు వసూలు చేసినట్టు ఫిల్మ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రం ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. 
 
ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడంతో పాటు.. కలెక్షన్ల వర్షం కురిపించడానికి ఏకైక కారణం మాత్రం ఈ చిత్ర దర్శకుడు వివి వినాయక్‌ ప్రధాన కారణం. ఈ చిత్రాన్ని అద్భుత రీతిలో మలచారు. అందుకే వినాయక్ కు ఓ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వాలని ఆ సినిమా హీరో చిరంజీవితో పాటు.. నిర్మాత రామ్ చరణ్ తేజ్ డిసైడ్ అయ్యాడట. 
 
ఇప్పటికే 'శ్రీమంతుడు' సినిమాకుగాను మహేష్ బాబు నుంచి ఖరీదైన కారును, 'జనతా గ్యారేజ్' హిట్ అయినందుకు ఎన్టీఆర్ నుంచి విలువైన ఫ్లాట్‌ను దర్శకుడు కొరటాల శివ అందుకున్నాడు. ఇప్పుడు వినాయక్‌కు వీటన్నింటి కంటే భారీ గిఫ్ట్‌ను ఇవ్వాలని తండ్రీతనయులు భావిస్తున్నారట.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలకృష్ణ 'బాలీవుడ్' స్టయిల్... షూటింగ్ ప్రారంభం కాకుండానే 101వ చిత్రం రిలీజ్ డేట్!