Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ర‌జ‌నీకాంత్ న‌ట‌న‌కు గుడ్‌బై చెప్ప‌నున్నారా!

Advertiesment
ర‌జ‌నీకాంత్ న‌ట‌న‌కు గుడ్‌బై చెప్ప‌నున్నారా!
, గురువారం, 27 మే 2021 (20:07 IST)
Rajani kanth
సూపర్ స్టార్ రజనీకాంత్ త‌న న‌ట‌న‌కు గుడ్‌బై చెప్ప‌నున్నార‌నే వార్త‌లు కోలీవుడ్‌లో నెల‌కొంది. ఆమ‌ధ్య కోవిడ్ పాజిటివ్‌కు గురికావడం ఆ త‌ర్వాత విశ్రాంతి తీసుకోవ‌డం జ‌రిగింది. కోలుకున్నాక తిరిగి `అన్నాత్తే` సినిమా షూటింగ్ కోసం హైద‌రాబాద్ ఫిలింసిటీకి వ‌చ్చారు. అక్క‌డ 15రోజులు షూటింగ్ ముగించుకుని తిరిగి చెన్నై వెళ్ళిపోయారు. కాగా, హైద‌రాబాద్‌ షూటింగ్‌లో ద‌ర్శ‌కుడితో మాట్లాడుతూ ఇక‌నుంచి న‌ట‌నకు దూరంగా వుండాల‌నుకుంటున్న‌ట్లు సంభాష‌ణ‌లు జ‌రిగాయ‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ కు చెందిన‌వారు లీక్ చేశార‌ని కోలీవుడ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.
 
వ‌య‌స్సురీత్యా వ‌చ్చే ఆరోగ్య స‌మ‌స్య‌లవ‌ల్ల ఆమ‌ధ్య రాజ‌కీయాల్లోకి కూడా వెళ్ళ‌వ‌ద్ద‌ని ఇదే హైద‌రాబాద్ షూటింగ్ ముగించుకుని ఫ‌స్ట్ షెడ్యూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిన‌ప్పుడు ర‌జ‌నీ కుటుంబ స‌భ్యులు రాజ‌కీయాల‌కూ దూరంగా వుండ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. ప్ర‌స్తుతం వ‌య‌స్సురీత్యా ఇంకా విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించిన‌ట్లుగా తెలుస్తోంది. యాక్టింగ్ అంటే న‌వ‌ర‌సాలు కృత్రిమంగా పండించాలి. అలా చేసేట‌ప్పుడు బాడీలోని లోప‌ల భాగాలు ఉద్వేగానికి గుర‌వుతాయి. దానివ‌ల్ల లేనిపోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుకే శోభ‌న్‌బాబు ముందుగానే రిటైర్ తీసుకున్నారు. దాదాపు 46 ఏళ్ళ‌నుంచి ర‌జ‌నీ న‌టిస్తూనే వున్నారు. పైగా క‌రోనా స‌ద్దుమ‌ణిగాక రొటీన్‌గా అమెరికా వెళ్ళి హెల్త్ చెక‌ప్ చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇర‌వై రెండేళ్ళ‌ మల్టీస్టారర్ సుల్తాన్