మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా విశ్వంభర. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో జరుగుతుంది. ఇప్పటివరకు సాంగ్స్ పూర్తయ్యాయి. ఆమధ్య రాముడిపై ఓ సాంగ్ ను కూడా చిత్రీకరించారు. మరో పాటను తీయనున్నారని చిత్ర యూనిట్ చెప్పింది. దీనికి బాలీవుడ్ కథానాయిక నర్తించనుందని తెలిసింది. కాగా, చిరంజీవి ఈసారి అభిమానులను అలరించేవిధంగా ఓ పాటను సెలక్ట్ చేసుకున్నారని సమాచారం.
చిరంజీవి గతంలో చేసిన పాటను రీమిక్స్ గా విశ్వంభరలో తేనున్నారట. గతంలో తాను నటించిన అన్నయ్య చిత్రంలో ఆటకావాలా.. పాట కావాలా.. అనే సాంగ్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తన పాటనే రీమిక్స్ చేయడం అందరికీ హుషారెత్తించేలా వుందని చెబుతున్నారు. దీనికి సంగీత దర్శకుడు భీమ్స్ చేత రీమిక్స్ పనులు జరుగుతున్నాయట. త్వరలో సెట్ పైకి తేనున్నారని సమాచారం. ఇదే కనుక కుదిరితే చిరంజీవి అభిమానులకు పండుగే పండుగ.