Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెక్స్ రాకెట్టే కాదు.. ఆన్‌లైన్ జూదం కూడా... నటి సంజన క్రీడలెన్నో...!

Advertiesment
Sanjana Galrani
, గురువారం, 8 అక్టోబరు 2020 (16:02 IST)
కన్నడ చిత్రసీమలో డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) దృష్టిసారించి లోతుగా విచారణ చేపట్టింది. ఇందులో కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలకు సంబంధం ఉన్నట్టు పక్కా ఆధారాలు సేకరించి వారిని అరెస్టు చేయడం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ బెంగుళూరు పరప్పణ అగ్రహార జైలులో జీవితం గడుపుతున్నారు. పైగా, వీరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. 
 
ఈ క్రమంలో సినీ అవకాశాలు పెద్దగా లేని ఈ ఇద్దరు హీరోయిన్లు కోట్లాది రూపాయలకు ఎలా పడగలెత్తారు, ఎలా ఆస్తులు కూడ బెట్టారన్న అంశంపై సీసీబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దృష్టిసారించింది. ఇందులో వీరిద్దరూ సెక్స్ రాకెట్ నడిపినట్టు తేల్చారు. ఇపుడు సంజనా గల్రానీ గురించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఖరీదైన పార్టీలు ఏర్పాటు చేయడం, ఆ పార్టీలకు వచ్చే మిలియనీర్లు, ఇండస్ట్రియలిస్టుల కుటుంబాలకు చెందినవారికి, సినీ సెలబ్రిటీలకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ సంజన బాగానే సంపాదించారని అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే సంజన బింగో, హకూనా అనే రెండు చైనా యాప్‌ల సాయంతోనూ ధనార్జన సాగిస్తున్నట్టు వెల్లడైంది. బింగో యాప్ ఆన్‌లైన్ జూదానికి సంబంధించిన యాప్. ఈ యాప్‌ను ఓ ఇంటర్నెట్ కాసినోగా భావించవచ్చు. ఇందులో సంజన గేమింగ్‌కు పాల్పడినట్టు తెలిసింది.
 
ఇక హకూనా యాప్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఉపయోగిస్తుంటారు. ఈ యాప్ ద్వారా చాటింగ్ చేసి అనేక అంశాలపై బెట్టింగులు నిర్వహించే వీలుంటుంది. హకూనా యాప్ సాయంతో సంజన పెద్ద ఎత్తున నగదు బదిలీలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఈ నగదు లావాదేవీలకు డ్రగ్స్ వ్యవహారంతో ఏమైనా సంబంధం ఉందా? అనేది నిర్ధారణ అయితే, సంజనపై మరిన్ని అభియోగాలు మోపే అవకాశం ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దసరాకి ప్రభాస్ అభిమానులకు బంపర్ ఆఫర్