Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎక్స్‌పోజ్ చేసే గట్స్ ఉన్న తెలుగమ్మాయి.. ముదురు హీరోతో రొమాన్స్ చేయనుంది!

తేజస్వి మదివాడ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో ఒక్కసారి ఇంకొక్కసారి.. అంటూ మహేష్‌ని ఆటపట్టించే సీన్‌లో తెలుగు జనాలకు బాగానే సుపరిచితురాలైన తెలుగమ్మాయి. పెద్ద హీరోయిన్ అవ్వాలని ఆశపడ్డా కూడా ఈ

Advertiesment
Ice cream girl Tejaswi Madivada
, బుధవారం, 26 అక్టోబరు 2016 (12:53 IST)
తేజస్వి మదివాడ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో ఒక్కసారి ఇంకొక్కసారి.. అంటూ మహేష్‌ని ఆటపట్టించే సీన్‌లో తెలుగు జనాలకు బాగానే సుపరిచితురాలైన తెలుగమ్మాయి. పెద్ద హీరోయిన్ అవ్వాలని ఆశపడ్డా కూడా ఈ భామకు అవకాశాలు కరువయ్యాయి. వర్మ నుంచి వచ్చిన పిలుపుతో ఆడియన్స్‌కు ఐస్‌క్రీమ్ టేస్ట్ కూడా చూపించింది. ఇంత చేసినా ఈ భామకు బ్రేక్ మాత్రం రాలేదు. 
 
ఇప్పుడు రోజులు మారాయి అంటూ.. మారుతి స్క్రిప్ట్‌తో వస్తున్న ఓ మూవీలో నటిస్తోంది తేజస్వి. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా ప్రయత్నాలు సాగిస్తున్నా.. పెద్దగా వర్కవుట్ కావడం లేదు. ఇటు అందం.. దాన్ని ఎక్స్‌పోజ్ చేసే గట్స్ ఉన్నా.. ఇంకా రోజులు మారాలని ఎదురుచూస్తూనే ఉంది తేజస్వి. 
 
తాజాగా ఈ భామ వెంకటేష్‌తో కలిసి నటించే అవకాశాన్ని మరోసారి దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ''సాలా ఖద్దూస్‌''కి తెలుగు రీమేక్‌గా గురు చిత్రంతో బిజీగా ఉన్న వెంకటేష్.. మరో మూవీలో కూడా నటించనున్నాడు. నిత్యా మీనన్‌తో కలిసి రొమాంటిక్ కామెడీ చేయనున్న వెంకీ సినిమాలోకి.. తేజస్విని కూడా తీసుకున్నారు. ''ఆడాళ్లూ మీకు జోహార్లు'' అనే టైటిల్‌పై రూపొందుతున్న మూవీలో తన కంటే వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చే వ్యక్తిగా వెంకటేష్ నటించనున్నాడు. 
 
వెంకీ - నిత్యాల సినిమాలో తాను నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది తేజస్వి. ''నేను ఓ రెబల్ మాదిరిగా బిహేవ్ చేసే టీనేజర్ పాత్రలో కనిపిస్తాను. తను అనుకున్నది చేసేయడమే తప్ప వేరే ఏదీ పట్టించుకోని రోల్ ఇది. వెంకటేష్ నటించే ఈ చిత్రంలో నలుగురు అమ్మాయిలుంటారు. వారిలో ఒకరిగా నేను నటిస్తున్నా. లీడ్ రోల్ కాదు కానీ.. సినిమాకి చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది'' అని చెబుతోంది తేజస్వి. చాలా కాలం తర్వాత ఈ భామకి పెద్ద సినిమాలో ఇంపార్టెంట్ రోల్ రావడంతో ఖుషి ఖుషీగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిధరమ్ తేజ్‌ చిత్రంలో ఐటమ్ గర్ల్‌గా అనసూయ... పవన్‌కు హ్యాండ్