Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెల్ఫీ తీస్తున్న అభిమానిపై చేయిచేసుకున్న బాలకృష్ణ? వీరావేశంతో ఊగిపోయాడు...

నందమూరి బాలకృష్ణ తన అభిమానిపై చేయి చేసుకున్నంత పని చేశాడు. తనతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ అభిమానిపై వీరావేశంతో ఊగిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఓ వెబ్‌సైట్ అప్‌లోడ్ చేయగా, ఇపుడది సోషల

Advertiesment
సెల్ఫీ తీస్తున్న అభిమానిపై చేయిచేసుకున్న బాలకృష్ణ? వీరావేశంతో ఊగిపోయాడు...
, శుక్రవారం, 13 జనవరి 2017 (13:47 IST)
నందమూరి బాలకృష్ణ తన అభిమానిపై చేయి చేసుకున్నంత పని చేశాడు. తనతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ అభిమానిపై వీరావేశంతో ఊగిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఓ వెబ్‌సైట్ అప్‌లోడ్ చేయగా, ఇపుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి". క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, మంచి విజయాన్ని సాధించింది. 
 
ఈ క్రమంలో చిత్రాన్ని వీక్షించేందుకు థియేటర్‌కు వచ్చిన బాలయ్యతో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన బాలయ్య... ఆ అభిమాని చేయిపై కొట్టడంతో మొబైల్ ఫోన్ కిందపడిపోయింది. ఆ తర్వాత పక్కన వుండేవారు ఆ అభిమానిని వారించారు. అయితే, బాలయ్య మాత్రం వీరావేశంతో ఊగిపోతూ... అతని నానా మాటలు అంటున్నట్టుగా ఆ వీడియో ప్లే అవుతోంది.

ఈ వీడియోపై ఇప్పుడు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. నందమూరి యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియోతో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. చాలామంది నెటిజన్లు కూడా బాలయ్య ఇలా చేసుండకూడదని చెబుతున్నారు. మరికొంతమందేమో అభిమానులదే తప్పన్నట్టు సెటైరికల్‌గా పోస్టులు పెడుతున్నారు. 

నిజానికి అదే థియేటర్ వద్ద.. ఈ ఘటన జరిగినప్పుడు ఉన్న పలువురు అభిమానులు ‘థియేటర్‌ లోపల ఓ అమ్మాయి అడిగితే కాదనకుండా లేచి, నిలబడి మరీ ఫొటోలకు ఫోజులిచ్చిన బాలయ్య.. థియేటర్ బయట ఓ అబ్బాయి సెల్ఫీ తీసుకుంటుండగా ఇలా చేయడమేంటి’ అని అడుగుతున్నారు. 
 
‘నటసార్వభౌమ నందమూరి తారకరాముడి కుమారుడిగా నటనలోనూ, రాజకీయంగానూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ.. అభిమానులతో ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. లేదంటే అక్కడ క్రౌడ్ అంతా క్లియర్ చేశాక బాలయ్య బయటకు వచ్చుంటే ఇలా జరిగే అవకాశం ఉండేదికాదేమో’ అని బాలయ్య అభిమానులు కొంతమంది అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ఖైదీ నంబర్ 150"కి పెట్టిన డబ్బులు ఒక్క రోజులోనే వచ్చాయట.. 'శాతకర్ణి' పరిస్థితేంటి?