Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్న మామ - కోడలు... చైతూ పరిస్థితేంటి?

మామ కోడలు తెగ ఎంజాయ్ చేస్తున్నారట. వీరిద్దరి తొలి ఎక్స్‌పీరియన్స్‌ను కూడా రుచిచూశారట. ఇంతకీ ఆ మామా కోడలు, ఆ అనుభూతి ఏంటన్నదే కదా మీ సందేహం. అయితే ఈ కథనం చదవండి. ఆ మామ ఎవరో కాదు.. టాలీవుడ్ మన్మథుడు అక్

Advertiesment
ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్న మామ - కోడలు... చైతూ పరిస్థితేంటి?
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (10:34 IST)
మామ కోడలు తెగ ఎంజాయ్ చేస్తున్నారట. వీరిద్దరి తొలి ఎక్స్‌పీరియన్స్‌ను కూడా రుచిచూశారట. ఇంతకీ ఆ మామా కోడలు, ఆ అనుభూతి ఏంటన్నదే కదా మీ సందేహం. అయితే ఈ కథనం చదవండి. ఆ మామ ఎవరో కాదు.. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కాగా, కోడలు హీరోయిన్ సమంత. తన పెద్ద కుమారుడు నాగ చైతన్యను సమంత పెళ్లి చేసుకోనున్న విషయం తెల్సిందే. దీంతో నాగార్జున, సమంతలు మామ - కోడలు అయిపోయారు. 
 
ఈ నేపథ్యంలో ఓంకార్ దర్శకత్వంలో 'రాజుగారి గది' సీక్వెల్‌గా 'రాజుగారి గది 2' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాగార్జున, ఆయనకి కాబోయే కోడలు సమంత కలిసి నటిస్తోంది. అయితే, ఇప్పటివరకు వీరిద్దరు కలిసి నటించే సీన్స్‌ని చిత్రీకరించలేదు. తాజా షెడ్యూల్‌లో నాగ్ - సమంతల మధ్య సీన్స్‌ని తెరకెక్కించారట. 
 
గతంలో 'మనం' చిత్రంలో నాగ్ - సమంత కలిసి నటించారు. అయితే, అఫిషీయల్‌గా మామ-కోడలు అయిన తర్వాత చేస్తోన్న తొలి చిత్రం మాత్రం ఇదే. మామ-కోడళ్లు షూటింగ్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నారంట. వీరి మధ్య తెరకెక్కించే సన్నివేశాలను చూసి మురిసిపోదామని అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నా లైఫ్.. నా యిష్టం... మీరెవరూ నీతులు చెప్పేందుకు' : ఇలియానా ఫైర్