Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Advertiesment
sanjay leela bhansali

ఠాగూర్

, మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (18:59 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీపై అవనీతి ఆరోపణలు వచ్చాయి. ఈయన డబ్బులు ఎగ్గొట్టినట్టు వార్తలు వస్తున్నాయి. తన ప్రతిష్టాత్మక చిత్రం లవ్ అండ్ వార్ మూవీ కోసం లైన్ ప్రొడ్యూసర్‌గా  వ్యవహించారు. అయితే, ఈ సినిమా నిర్మాణం కోసం చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదన్నది ప్రధాన అభియోగంగా ఉంది. 
 
తన ప్రతిష్టాత్మక చిత్రం 'లవ్ అండ్ వార్' కోసం లైన్ ప్రొడ్యూసర్‌గా నియమించుకుని, డబ్బులు చెల్లించకుండా మోసం చేయడమే కాకుండా, తనపై దాడి చేసి బెదిరించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
 
రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా, బిచ్వాల్ పోలీస్ స్టేషనులో సోమవారం రాత్రి ఈ ఎఫ్ఎస్ఐఆర్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు. జోధ్‌పూర్‌కు చెందిన చెందిన రాధా ఫిల్మ్స్ అండ్ హాస్పిటాలిటీ సీఈఓ ప్రతీక్ రాజ్ మాథుర్ ఈ ఫిర్యాదు చేశారు. 'లవ్ అండ్ వార్' చిత్రానికి తనను లైన్ ప్రొడ్యూసర్‌గా నియమించుకున్నారని, ఈ మేరకు అధికారిక ఒప్పందం లేకపోయినా ఈ-మెయిల్ ద్వారా ధ్రువీకరించారని ఆయన తెలిపారు. ప్రభుత్వ అనుమతులు, భద్రతా ఏర్పాట్లు వంటి కీలక పనులన్నీ తానే చూసుకున్నానని, అయితే తర్వాత తనను తొలగించి, ఇవ్వాల్సిన పారితోషికం చెల్లించలేదని మాథుర్ ఆరోపించారు.
 
కేవలం డబ్బులు ఎగ్గొట్టడమే కాకుండా, తనతో దురుసుగా ప్రవర్తించారని కూడా మాథుర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగస్టు 17న బికనీర్‌లోని హోటల్ నరేంద్ర భవన్‌లో భన్సాలీ, ఆయన ప్రొడక్షన్ మేనేజర్లు ఉత్కర్ష్ బాలి, అర్వింద్ గిల్ తనను తోసివేసి, తీవ్ర పదజాలంతో దూషించారని ఆరోపించారు. భవిష్యత్తులో తన కంపెనీకి అవకాశాలు రాకుండా అడ్డుకుంటామని బెదిరించారని కూడా ఆయన తెలిపారు. నమ్మకద్రోహం, చీటింగ్ కింద ఈ కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...