Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి - బాలకృష్ణల మధ్య చిక్కుకుని నలిగిపోతున్న నాని... పాపం.. ఎలా బయటపడతాడో?

మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణల మధ్య యువ హీరో నాని చిక్కుకుని నలిగిపోతున్నాడు. వారిద్దరి నుంచి ఎలా బయటపడాలో తెలియక తల్లడిల్లిపోతున్నాడు. ఇంతకీ వారిద్దరి మధ్య నాని ఎలా చిక్కుకున్నాడో పరిశీలిస్తే

Advertiesment
Chiranjeevi
, శనివారం, 3 డిశెంబరు 2016 (12:39 IST)
మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణల మధ్య యువ హీరో నాని చిక్కుకుని నలిగిపోతున్నాడు. వారిద్దరి నుంచి ఎలా బయటపడాలో తెలియక తల్లడిల్లిపోతున్నాడు. ఇంతకీ వారిద్దరి మధ్య నాని ఎలా చిక్కుకున్నాడో పరిశీలిస్తే... సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150', బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీరిద్దరితో పాటు.. మరికొందరి హీరోల సినిమాలు కూడా విడుదల కానున్నాయి. 
 
మరో ఇద్దరు సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జునలు కూడా సంక్రాంతి సమరానికి దిగుదామని భావించినా.. చివరికి రాకూడదని డిసైడ్ అయ్యారు. అయితే, ఇప్పుడు యంగ్ హీరోలు నాని, శర్వానంద్‌లు మాత్రం చిరంజీవి - బాలకృష్ణలకి పోటీకి దిగేందుకు రెడీ అయినట్టు సమాచారం. గత సంక్రాంతికి నాలుగు సినిమాల మధ్యలో శర్వానంద్ 'రన్ రాజా రన్'తో వచ్చి హిట్ కొట్టాడు. ఈ సంక్రాంతికి 'శతమాన భవతి' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రమిది. 'శతమాన భవతి' ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొస్తేనే రిజల్ట్ బాగుంటుందని దిల్ రాజు భావిస్తున్నారంట.
 
దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతోన్న మరో చిత్రం 'నేనులోకల్'. డిసెంబర్ 22వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు సూర్య 'సింగం-3' డిసెంబర్ 23కి వాయిదా పడటంతో నానిని సంక్రాంతి పోరులో దించడంమేలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారంట. మొత్తానికి.. చిరు - బాలయ్యలకి పోటీగా యంగ్ హోరోలు శర్వానంద్, నానిలని దించేందుకు దిల్ రాజు రెడీ అయ్యాడు. మరీ.. పెద్ద హీరోల నడుమ వచ్చిన ఈ యంగ్ హీరోలు ఏ మేరకు నిలబడతారనేది చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫలించిన మెగాస్టార్ ప్రయత్నాలు.. సూర్య 'సింగం-3' రిలీజ్ వాయిదా.. ధృవకు తిరుగేలేదట...