ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా : 'ద్వారక' హీరోయిన్ పూజా జవేరి
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. ఈ హీరోకు ఇపుడు 37 యేళ్లు. ఈయన పెళ్లిపై ఎప్పటి నుంచో పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. కానీ, వీటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు నిజం కాలేదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. ఈ హీరోకు ఇపుడు 37 యేళ్లు. ఈయన పెళ్లిపై ఎప్పటి నుంచో పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. కానీ, వీటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు నిజం కాలేదు. ఈ నేపథ్యంలో 'ద్వారక' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పూజా జవేరి.. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌పై మనసు పారేసుకుంది. ప్రభాస్‌ను పెళ్ళి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.
దీనిపై ఆమె స్పందిస్తూ తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ప్రభాస్ అంగీకరిస్తే పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్టేట్మెంట్ ఇచ్చేసింది. దీంతో టాలీవుడ్ ఆశ్చర్యపోయింది. ప్రభాస్‌ను చేసుకునేందుకు చాలా మంది హీరోయిన్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇలా ఇంతవరకు ఎవరూ బహిరంగంగా స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేదు.
మరోవైపు... ప్రభాస్‌కు సంబంధాలు చూస్తున్నామని, 'బాహుబలి 2' తర్వాత సంబంధాలు కుదిరితే వెంటనే వివాహం చేస్తామని ప్రభాస్ పెదనాన్న, ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.