రెబల్ స్టార్ ప్రభాస్ పెండ్లి గురించే ఆయన కుటుంబలోనూ, బయట పెద్ద చర్చ జరుగుతోంది. ఆమధ్య అనుష్కతో పెండ్లి అయిపోయిందనే టాక్ కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. ఎందుకనో అనుష్క నటనకు దూరంగా వుండిపోయింది. ఇక ఇప్పుడు ఓ సినిమా చేస్తుంది. ఇక ప్రభాస్ విషయానికి వస్తే, ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు కూడా పెండ్లి చేసుకోమని చెప్పాడు. తమ బంధువులైన రాజుల కుటుంబాలలో అమ్మాయిను కూడా చూశామని త్వరలో పెండ్లి చేసుకోతున్నాడని మరో వార్త కూడా వచ్చింది.
అయితే వీటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ, తెలుగు సినిమారంగంలో జ్యోతిష్యం చెప్పే వేణుస్వామి తాజాగా ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అసలు ప్రభాస్‌కు పెండ్లి యోగం లేదు. చేసుకుంటే కెరీర్ ఢమాల్ అవుతుందని సారాంశం. ఆయనకు ఓ యూట్యూబ్ ఛానల్ వుంది. దాని ద్వారా పలువురి ప్రముఖుల జాతకాలు చక్రాలు వేసి చూపిస్తుంటాడు. నాగచైతన్య, సమంత కరెక్ట్ పెయిర్ కాదనీ, త్వరలో విడిపోతారని చెప్పాడు. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే అయినా. ఆయన జ్యోతిష్యుడు కాబట్టి అందరూ నమ్మారు.
మరోవైపు ఇటీవలే పెండ్లి చేసుకున్న నయనతార వివాహం కూడా ఎక్కువకాలం నిలవదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అందుకు గ్రహాలు, చక్రాలు వేసి చూపించాడు. ఇప్పుడు తాజాగా ప్రభాస్ గురించి చెప్పేసరికి అది ఫ్యాన్స్‌లో పెద్ద గందరగోళం నెలకొంది. సహజంగా కుజదోషం వుంటే అదే దోషం వారిని పెండ్లిచేసుకోవాలి. లేదంటే వివాహం నిలవదు. ఈ లాజిక్కుతో వేణుస్వామి పలు విసయాలు చెబుతూ, పెండ్లి చేసుకుంటే ప్రభాస్ ఆరోగ్యం కూడా సరిగా సహకరించదు అనే మరో స్టేట్‌మెంట్ ఇవ్వడంతో అది పెద్ద చర్చగా మారింది.
ఇటీవలే ప్రభాస్ కుడికాలుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. గతంలో కూడా రెండుసార్లు అలా చేయించుకున్నారని సినిమారంగంలో వినికిడి. సో. ప్రభాస్ కుటుంబంనుంచి ఏదైనా స్టేట్‌మెంట్ వస్తేకానీ అభిమానులు, సినిమారంగం కూల్‌గా వుండదు.