Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీనియర్ హీరో కూతురిపై దర్శకుడు తేజ కన్ను...!

విలక్షణమైన దర్శకత్వంలో ముందుకు వెళ్ళడం దర్శకుడు తేజకు అలవాటు. చిన్న సినిమాలతోనే మంచి పేరు సంపాదించుకున్న దర్శకుల్లో తేజ ఒకరు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా తక్కువ ఖర్చుతో సినిమాలు తీసి ఎక్కువ రా

Advertiesment
సీనియర్ హీరో కూతురిపై దర్శకుడు తేజ కన్ను...!
, మంగళవారం, 14 మార్చి 2017 (14:19 IST)
విలక్షణమైన దర్శకత్వంలో ముందుకు వెళ్ళడం దర్శకుడు తేజకు అలవాటు. చిన్న సినిమాలతోనే మంచి పేరు సంపాదించుకున్న దర్శకుల్లో తేజ ఒకరు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా తక్కువ ఖర్చుతో సినిమాలు తీసి ఎక్కువ రాబడిని గడించడంలో తేజ సిద్ధహస్తుడన్నది అందరికీ తెలిసిన విషయమే. ఉదయ్ కిరణ్‌, నితిన్, సదా, నవదీప్, నందిత, కాజల్ ఇలా ఒక్కరు కాదు.. ఎంతోమంది కొత్త నటీనటులకు సినీపరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది తేజానే. అలాంటి తేజ ఇప్పుడు సినిపరిశ్రమలో మరో నటుడు కుమార్తెను తెలుగుతెరకు పరిచయం చేయబోతున్నారు... 
 
ఇందులోభాగంగా తేజ కన్ను ఓ సీనియర్ హీరో కూతురిపై పడింది. హీరో రాజేశేఖర్, నటి జీవిత కూతురు శివానీని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తేజ తీసుకున్నట్టు సమాచారం. కుదిరితే ఈ ఏడాదిలోనే శివానీని హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు తేజ ప్రయత్నిస్తున్నాడు.
 
రాజశేఖర్ కూతురు హీరోయిన్‌గా రాబోతుందనే వార్త ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఈ మేరకు పలువురు దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ తేజ పేరు మాత్రం ఎప్పుడూ వినిపించలేదు. ఇప్పుడు ఈ న్యూస్ కన్ఫాం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే తన కూతురు సినిమా ఎంట్రీపై రాజశేఖర్ ప్రకటన కూడా చేయబోతున్నాడట.
 
ప్రస్తుతం రానా - కాజల్ హీరోహీరోయిన్లుగా ఓ పొలిటికల్ సెటైరికల్ సినిమా తెరకెక్కిస్తున్నాడు తేజ. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే, శివాని సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇది ఫిమేల్ ఓరియంటెడ్ సినిమానా లేక రొమాంటిక్ ఎంటర్టైనరా అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా : 'ద్వారక' హీరోయిన్ పూజా జవేరి