Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుడి ముందు భిక్షమెత్తుకుంటున్న నటుడు ఎవరు?

అందమైన లోకమనీ.. లగ్జరీ లైఫ్ అనుభవించవ్చనీ ఆశపడి చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన ఓ నటుడు.. చివరకు బిచ్చగాడిగా మారిపోయాడు. ఇపుడు ఓ గుడి ముందు కూర్చొని భిక్షమెత్తుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. కంట కన్నీరు తె

గుడి ముందు భిక్షమెత్తుకుంటున్న నటుడు ఎవరు?
, శనివారం, 24 జూన్ 2017 (11:41 IST)
అందమైన లోకమనీ.. లగ్జరీ లైఫ్ అనుభవించవ్చనీ ఆశపడి చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన ఓ నటుడు.. చివరకు బిచ్చగాడిగా మారిపోయాడు. ఇపుడు ఓ గుడి ముందు కూర్చొని భిక్షమెత్తుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. కంట కన్నీరు తెప్పించే ఈ సంఘటన చెన్నై, చూలైమేడులో చోటుచేసుకుంది. 
 
2004లో ఘన విజయం సాధించిన 'ప్రేమిస్తే' సినిమాలో హీరో భరత్, హీరోయిన్ సంధ్యను తీసుకుని స్నేహితుడు ఉంటున్న మ్యాన్షన్‌కు వెళ్తాడు. అక్కడి సన్నివేశంలో 'విరుచ్చికాంత్ పేరుతో హీరోగా నటిస్తా, ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్తా, ఆ తరువాత సీఎం అవుతా' అంటూ ఓ నటుడు డైలాగులు చెపుతాడు. ఆ నటుడి పేరు పల్లుబాబు. ఈ చిత్రంలోని ఆయన చెప్పిన డైలాగులు మంచి ఆదరణ కూడా పొందాయి. 
 
ఆ చిత్రం తర్వాత ఆ నటుడికి ఒక్క సినీ అవకాశం కూడా రాలేదు. దీంతో పేదరికంలో మగ్గిపోయాడు. దీనికితోడు తల్లిదండ్రుల మరణం అతనిని బాగా కుంగదీసింది. దీంతో పల్లుబాబు పొట్టపోసుకునేందుకు భిక్షాటనను ఎంచుకున్నాడు. చెన్నై, చూలైమేడులోని ఓ గుడిముందు కూర్చుని వచ్చీపోయే భక్తులను బిచ్చం అడుగుతున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటిగా ఎనలేని సంతృప్తినిచ్చిన చిత్రం మామ్ : శ్రీదేవి