Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖర్మ ఏంట్రా ఇలా కాలిపోయిందనుకున్నా... ఏం చేయమంటారు : చలపతి రావు

నా ఖర్మ ఇలా తగలెడింది... ఏం చేయమంటారు అని టాలీవుడ్ సీనియర్ నేత చలపతి రావు వాపోతున్నారు. ఆ మధ్య అమ్మాయిలు పక్కలోకి పనికివస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెను వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యలకు ఆయ

ఖర్మ ఏంట్రా ఇలా కాలిపోయిందనుకున్నా... ఏం చేయమంటారు : చలపతి రావు
, మంగళవారం, 18 జులై 2017 (13:29 IST)
నా ఖర్మ ఇలా తగలెడింది... ఏం చేయమంటారు అని టాలీవుడ్ సీనియర్ నేత చలపతి రావు వాపోతున్నారు. ఆ మధ్య అమ్మాయిలు పక్కలోకి పనికివస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెను వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యలకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. 
 
ఇంతలోనే ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్ల గురించి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ముంబై నుంచి ఓ హీరోయిన్ వచ్చిందని, కేరెక్టర్ కోసం చీర కట్టుకోవాలని చెబితే.. ‘చీర.. చీర కట్టుకోవడానికి నన్ను ముంబై నుంచి పిలిపించారా..?’ అంటూ ప్రశ్నించిందన్నారు. 
 
దానికి ఖంగుతన్న తాను.. ఖర్మ ఏంట్రా ఇలా కాలిపోయిందనుకుని నోరుమూసుకున్నానని చెప్పారు. బట్టల్లేకుండా యాక్టింగ్ చేయడానికి ఆ అమ్మాయి రెడీగా ఉందని, అందుకే అలాంటి వాళ్ల వల్లే నేడు తెలుగులో తెలుగు ఆర్టిస్టులు లేరని వ్యాఖ్యానించారు. రానురాను సినిమాల్లో నైతిక విలువలు దిగజారిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మత్తుదందాలో తాజా సమాచారం ఏంటంటే.. విచారణలో ఫస్ట్ వికెట్ పూరీదే...