తమిళ్ నాట స్టార్ కమెడియన్ నుంచి హీరోగా ఎదిగిన సూరి చిక్కుల్లో పడ్డాడు. ఆకలి బాధను తీర్చుకునేందుకు ఈ కెమెడియన్ మధురైలో పలు చోట్ల "అమ్మన్" పేరుతో హోటళ్లు ప్రారంభించాడు.
దీంతో సామాన్యుడికి తక్కువ ధరలోనే నాణ్యమైన ఆహారం అందిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ ఇదే ఆయన ఆస్తులపై ప్రభుత్వం సోదాలు నిర్వహించేలా చేసింది.
తమ వ్యాపారం దెబ్బ తింటుంది అనే ఆలోచనతో.. ఆ ప్రాంతంలోని కొందరు వ్యాపారులు అమ్మన్ హోటల్స్‌పై ఫిర్యాదులు చేయగా, ప్రభుత్వం ఈ సోదాలు నిర్వహించింది.
రైడ్‌లో భాగంగా ధరలు పట్టిని పరిశీలించగా.. జీఎస్టీ పన్ను చెల్లించడం లేదని గమనించారు. దీంతో అమ్మన్ హోటల్స్ నిర్వాహులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేశారు.