బాహుబలి-2కు భారీ క్రేజ్.. ట్రెయిలర్ రైట్స్... రూ.44 కోట్లా...?
బాహుబలి విడుదల తర్వాత ఎంతో క్రేజ్ వచ్చినా.. కొందరు పెద్ద చిత్రమేమీ కాదని పెదవి విరిచినవారున్నారు. ఇటీవలే దాసరి కూడా... తాను ఓటేయాల్సి వస్తే బాహుబలి కంటే.. 'పెళ్లిచూపులు' చిత్రానికే ఓటేస్తానని ప్రకటిం
బాహుబలి విడుదల తర్వాత ఎంతో క్రేజ్ వచ్చినా.. కొందరు పెద్ద చిత్రమేమీ కాదని పెదవి విరిచినవారున్నారు. ఇటీవలే దాసరి కూడా... తాను ఓటేయాల్సి వస్తే బాహుబలి కంటే.. 'పెళ్లిచూపులు' చిత్రానికే ఓటేస్తానని ప్రకటించారు. ఏదిఏమైనా ఇప్పటి జనరేషన్‌కు బాహుబలి బాగా కనెక్ట్ అయింది. దాంతో.. రెండో భాగాన్ని భారీగా బిజినెస్ చేసేందుకు నిర్మాతలకు అవకాశం దక్కింది.
అందుకు ముందనుంచి తన టీమ్‌తో 'అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, బాహుబలి, భల్లాలదేవల మధ్య ఏం జరిగింది? అన్న ప్రశ్నలను.. రాజమౌళికి చెందిన నెట్ మాధ్యమాల్లో విపరీతంగా పబ్లిసిటీ ఇస్తున్నారు. దాంతో రెండవ పార్ట్ థియేట్రికల్ హక్కుల ధరలు ఆకాశానంటుతున్నాయి. అయినా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా కోట్లు వెచ్చించి బాహుబలి-2ని బయ్యర్లు కొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం తమిళనాడు థియేట్రికల్ రైట్స్ రూ. 44 కోట్లు పలికాయట. దీన్ని ఎవరు తీసుకున్నారో ఇంకా తెలియాల్సి వుంది. 2017 ఏప్రిల్ నెలలో ఈ చిత్రం విడుదల కానుంది.