Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''భాగమతి'' చారిత్రక కథాంశం కాదు.. అనుష్క ఖాతాలో మరో అరుంధతి అవుతుందా?

''అరుంధతి'', ''బాహుబలి'', ''రుద్రమదేవి'' లాంటి సినిమాల్లో నటించిన అనుష్క త్వరలో ''భాగమతి'' సినిమాలో లీడ్ రోల్లో నటించనుంది. అయితే కేవలం టైటిల్ మాత్రమే ఎనౌన్స్ చేసిన ఈ సినిమా హైదరాబాద్ నిర్మాణానికి కా

Advertiesment
Anushka
, గురువారం, 6 అక్టోబరు 2016 (17:22 IST)
''అరుంధతి'', ''బాహుబలి'', ''రుద్రమదేవి'' లాంటి సినిమాల్లో నటించిన అనుష్క త్వరలో ''భాగమతి'' సినిమాలో లీడ్ రోల్లో నటించనుంది. అయితే కేవలం టైటిల్ మాత్రమే ఎనౌన్స్ చేసిన ఈ సినిమా హైదరాబాద్ నిర్మాణానికి కారణమైన చారిత్రక పాత్ర భాగమతి జీవిత కథ అన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే జానపద, చారిత్రక పాత్రల్లో నటించిన అనుష్క లీడ్ రోల్లో నటిస్తుండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
 
భాగమతి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా చారిత్రక కథాంశం కాదంటూ ప్రకటించాడు అశోక్. పిల్ల జమీందార్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ తొలి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఆ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ''భాగమతి'' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. దసరా పండుగ తరువాత హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో ఈ షెడ్యూల్ జరగనుంది. ఇక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్స్‌లో సినిమా పూర్తయ్యేంత వరకూ షూటింగ్ కొనసాగుతుంది. తెలుగులో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా, తమిళంలో జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అనుష్క ఖాతాలో 'అరుంధతి' .. 'రుద్రమదేవి' వంటి భారీ హిట్స్ ఉండటంతో, సహజంగానే 'భాగమతి'పై భారీ అంచనాలు వున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణవంశీ దర్శకత్వంలో ''భక్తకన్నప్ప'': శివభక్తుడిగా మంచు విష్ణు..