Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క శెట్టి ప్రెగ్నెంట్..? సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్..

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. అనుష్క త్వరలో పెళ్ళి చేసుకోబోతోంది. అదీ టాలీవుడ్‌కు చెందిన టాప్ నిర్మాతతో. ఇది పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగ

Advertiesment
Anushka
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (14:05 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. అనుష్క త్వరలో పెళ్ళి చేసుకోబోతోంది. అదీ టాలీవుడ్‌కు చెందిన టాప్ నిర్మాతతో. ఇది పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నట్లు టాక్. పరిశ్రమలోని వారందరికీ ఈ విషయం తెలుసని... అంతేకాదు అనుష్కతో నిర్మాత అన్యోన్యంగా ఉంటున్న విషయం నిర్మాత కుటుంబ సభ్యులకు కూడా తెలుసని నిర్మాతకు చెందిన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన ఇప్పటికే అనుష్కతో పలు సినిమాలు కూడా నిర్మించారు. 
 
అయితే ఈ పెళ్ళికి అనుష్క, ఆ నిర్మాత మాత్రం పూర్తిగా రెఢీ అయిపోయారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అరుంధతి సినిమాతో టాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేసిన అనుష్క ఆ తర్వాత అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఈ చిత్రం ద్వారా అనుష్క కొత్త శకంలోకి అడుగుపెట్టి ఎన్నో ప్రతిష్టాత్మక.. చారిత్రక సినిమాలు దక్కించుకుని విజయబావుటా ఎగరేసింది. ఇకపోతే.. స్వీటీ రాజమౌళి దర్శకత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో ఓ మైలురాయిగా రుపొందుతున్న బాహుబలిలో దేవసేనగా, బాహుబలి భార్యగా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం యూనిట్ సభ్యులు బాహుబలి సినిమా పతాక సన్నివేశాలు చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నారు. సినిమాలో అత్యంత కీలక సన్నివేశామైన బాహుబలి దేవసేనని బల్లాల దేవా సైన్యం తరుముతున్నట్లు, వాళ్ళు ఇరువురూ ఓ గుహలోకి వెళ్ళినట్లు, ఆ సమయంలో అనుష్క నిండు గర్భిణీగా నటిస్తున్నట్లుగా... బాహుబలి షూటింగ్ నుంచి లీక్ అయిన ఓ ఫోటో గురించే వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైరక్టర్ సుందర్ సి హై బడ్జెట్ ఆఫర్‌ను వదులుకున్న ప్రిన్స్ మహేష్ బాబు...