Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనసూయా... డక్ అంటే బాతు కాదు.. బూతు.. చెప్పమంటావా? పూరీ జగన్నాథ్

''పటాస్'' చిత్రంతో ఫుల్ ఫామ్‌లోకొచ్చాడు కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''ఇజం''.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటించగా జగపతిబా

అనసూయా... డక్ అంటే బాతు కాదు.. బూతు.. చెప్పమంటావా? పూరీ జగన్నాథ్
, శనివారం, 8 అక్టోబరు 2016 (13:56 IST)
''పటాస్'' చిత్రంతో ఫుల్ ఫామ్‌లోకొచ్చాడు కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''ఇజం''.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటించగా జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌లతో ఈ సినిమాపై క్రేజ్‌ని మరింత రెట్టింపు చేసిన పూరి రీసెంట్‌గా వదిలిన టీజర్, ఇటీవల విడుదలైన ఆడియోతో మరో సారి తన మార్క్ చూపించాడు. హాలీవుడ్ స్టైల్‌లో మేకింగ్ ఉన్నట్లు కనిపిస్తుంది.. డైలాగ్స్ కూడా పూరి స్టైల్‌లో ఫాట్ మని కొట్టినట్టు ఎంతో సూటిగా ఉన్నాయని చూసిన రెండు డైలాగులే చెపుతున్నాయి. 
 
ఐ డక్ యు.. ఐ డక్ హిమ్.. ఐ డక్ ఎవ్రి వన్ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ పూరి స్టైల్ మరోసారి చూడబోతున్నామనిపిస్తుంది. అయితే ఈ చిత్రం ఆడియోని హోస్ట్ చేసిన యాంక‌ర్ అన‌సూయ‌కు ఓ సందేహం వ‌చ్చింది. అదేంటంటే.. ఇజం సినిమాలో క‌ల్యాణ్ రామ్ డ‌క్‌... డ‌క్‌... డ‌క్‌.. అనే ఓ డైలాగ్ అంటుంటాడు. అయితే అస‌లు డ‌క్ అంటే ఏంటీ అన్న సందేహ‌మే అన‌సూయ‌కు వ‌చ్చింది. అనసూయ ఆ ప్ర‌శ్న అడిగిన‌ప్పుడు ఆమె మొఖంలో డ‌క్ అనే ప‌దానికి ఓ బూత్ అర్థం ఉంద‌ని తెలుసు కానీ అలా చిలిపిగా అడిగింది. 
 
దానికి క‌ల్యాణ్ రామ్‌ను అడిగింది, పక్కనే ఉన్న అలీని కూడా అడిగింది. అయితే వీళ్లందరి కంటే కరెక్ట్‌గా పూరి జగన్నాథే సమాధానం చెబుతారంటూ జగన్‌కు మైక్ అందించింది. పూరీ డ‌క్ అంటే బాతు కాదు బూతు అని స‌మాధానం చెప్పాడు. ఆయన సమాధానానికి అబ్బ బూతు అంటూ పొంగిపోయింది. దాంతో అన‌సూయ అనుకున్న సందేహంతో పాటు.. కావాల్సిన స‌మాధానం దొరికింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళ్యాణ్‌రామ్‌ చేతికి ఉన్న ట్యాటులో ఉన్నది ఎవరంటే..?