Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐదేళ్ళ క్రితం పడకసుఖం ఇవ్వమన్నారు... మణిరత్నం హీరోయిన్

చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు కోలీవుడ్ హీరోయిన ఐశ్వర్యా రాజేష్ అంటోంది. సినీ ఛాన్సుల కోసం గాలించే క్రమంలో ఐదేళ్ళ క్రితం కొందరు పడకసుఖం కావాలని కోరార

Advertiesment
ఐదేళ్ళ క్రితం పడకసుఖం ఇవ్వమన్నారు... మణిరత్నం హీరోయిన్
, ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (09:36 IST)
చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు కోలీవుడ్ హీరోయిన ఐశ్వర్యా రాజేష్ అంటోంది. సినీ ఛాన్సుల కోసం గాలించే క్రమంలో ఐదేళ్ళ క్రితం కొందరు పడకసుఖం కావాలని కోరారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ప్రస్తుతం మణిరతర్న దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటించే అరుదైన అవకాశాన్ని కొట్టేసింది. నిజానికి ఐశ్వర్యా రాజేష్.. అచ్చ తెలుగు అమ్మాయి. అయినప్పటికీ, తమిళంలో రాణిస్తోంది. 
 
తాజాగా మణిరత్నం సినిమాలో చాన్స్ కొట్టేసిన ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ, నటుడు రాజేశ్ కుమార్తెగా 'డాడీ' చిత్రంతో బాలీవుడ్‌లోనూ కాలుమోపిన ఐశ్వర్య, ఓ ఐదేళ్ల క్రితం పరిశ్రమలో తానూ లైంగిక వేదింపుల ఇబ్బంది పడ్డానని చెప్పింది. హీరోయిన్లు చెబుతుండే 'ఎడ్జస్ట్‌మెంట్' అన్న పదం తనకూ ఎదురైందని, అయితే, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని అంది. 
 
ఒకవేళ ఎవరైనా ఆ మాట అంటే, మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వారిని చీల్చి చెండాడవచ్చని, అందువల్ల అలాంటి మాటలు చెప్పడానికి ఎంతో మంది భయపడుతున్నారని అంటోంది. ఇకపోతే.. ఇపుడు అరవింద్ స్వామి, జ్యోతిక, శింబు వంటి స్టార్స్‌తో కలసి మణిరత్నం దర్శకత్వంలో నటించనుండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి ప్రేమలు శాశ్వతం... నా ప్రేమను పొందాలంటే ఆ లక్షణలు ఉండాలి: మిల్కీ బ్యూటీ