తమిళనాడులోనూ చాలామంది సినిమా తారలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనుంది. జయలలిత, ఎంజీఆర్ తరహాలో తమిళనాట రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. చెన్నై చంద్రం త్రిష. దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన త్రిష.. దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
తమిళ్‌లో మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తుంది త్రిష. ఇక ఇప్పుడు ఈ అమ్మడు రాజకీయాల్లోకి వస్తుందన్న వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
త్రిష కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వనున్నారని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని టాక్. అలాగే త్రిష రాజకీయ ప్రవేశం వెనక దళపతి విజయ్ ఉన్నారన్న వార్త కూడా కోలీవుడ్‌లో వినిపిస్తోంది.