Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

ఎన్టీఆర్‌కు అత్తలా నటించాలా.. నా వయస్సెంతో తెలుసా? నటి లయ ప్రశ్న

లయ.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు లయ సుపరిచితమే. తెలుగు సినీపరిశ్రమలో తెలుగు హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ప్రేమించు, మనోహరం, స్వయవరం లాంటి సినిమాలతో మంచి గుర్త

Advertiesment
Actress Laya
, మంగళవారం, 6 మార్చి 2018 (22:11 IST)
లయ.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు లయ సుపరిచితమే. తెలుగు సినీపరిశ్రమలో తెలుగు హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ప్రేమించు, మనోహరం, స్వయవరం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లయ ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమకు దూరమవుతూ వచ్చారు. కారణం కొత్త హీరోయిన్లు రావడం.. ఎక్స్‌పోజింగ్ ఎక్కువవడంతో ఇక లయ సినిమాలు చేయడమే మానేసుకున్నారు.
 
కానీ ఇప్పుడు లయకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. జూనియర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తీయనున్న సినిమాలో లయకు అత్త క్యారెక్టర్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. తన క్యారెక్టర్ గురించి సినిమా గురించి మొత్తం లయకు వివరించారు. అయితే లయ ఒక్కసారిగా దర్శకుడిపై ఆగ్రహంతో ఊగిపోయింది. డైరెక్టర్ గారు.. నా వయస్సెంతో సరిగ్గా తెలుసా మీకు. ఇలాంటి క్యారెక్టర్లు ఇస్తే ఎలా చేయగలను.
 
నాకు సినిమాల్లో బాగా గ్యాప్ వచ్చింది. ఒకవేళ సినిమాల్లో నటించినా మంచి క్యారెక్టర్ చేయాలి కానీ ఈ అత్త క్యారెక్టర్ ఏంటని ప్రశ్నించిందట లయ. దీంతో త్రివిక్రమ్ బిక్కమొఖం వేశారట. ఇప్పటికే నదియా, ఖుష్భూ లాంటి హీరోయిన్లతో సినిమాలు చేసినట్లు త్రివిక్రమ్ లయ దృష్టికి తీసుకెళ్ళారట. అదంతా నాకు తెలుసు.. కానీ నేను మీరు చెప్పే క్యారెక్టర్లో అస్సలు నటించలేను. దయచేసి క్షమించడంటూ సున్నితంగా త్రివిక్రమ్ రిక్వెస్ట్‌ను తోసిపుచ్చిందట లయ. ఇప్పుడు లయ, త్రివిక్రమ్ వ్యవహారమే తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ‌ర్వానంద్-సాయి పల్లవిల 'పడి పడి లేచే మనసు'