Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నా లైఫ్.. నా యిష్టం... మీరెవరూ నీతులు చెప్పేందుకు' : ఇలియానా ఫైర్

గోవా బ్యూటీకి కోపమొచ్చింది. తనపై విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లపై ఆమె మండిపడ్డారు. నా లైఫ్.. నా ఇష్టం.. మీరెవరూ నీతులు చెప్పేందుకు అంటూ ఫైరయ్యారు. తనకు నీతులు చెప్పాలని ఎవరు ప్రయత్నించవొద్దని కోరింది

Advertiesment
'నా లైఫ్.. నా యిష్టం... మీరెవరూ నీతులు చెప్పేందుకు' : ఇలియానా ఫైర్
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (10:22 IST)
గోవా బ్యూటీకి కోపమొచ్చింది. తనపై విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లపై ఆమె మండిపడ్డారు. నా లైఫ్.. నా ఇష్టం.. మీరెవరూ నీతులు చెప్పేందుకు అంటూ ఫైరయ్యారు. తనకు నీతులు చెప్పాలని ఎవరు ప్రయత్నించవొద్దని కోరింది. ఇంతకీ ఈ సన్నజాజి నడుము చిన్నది మండిపడటానికి కారణమేంటో పరిశీలిద్ధాం. 
 
ఒకప్పుడు దక్షిణాది చిత్రసీమలో ఓ వెలుగువెలిగిన ఇలియానాకు.. ఇటీవలి కాలంలో సినీ ఆఫర్లు పూర్తిగా కరవయ్యాయి. దీంతో బాలీవుడ్‌కు పయనమైంది. హిందీ పరిశ్రమలో తొలి చిత్రం 'బర్ఫీ' ఇలియానాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమెకు ఆశించిన అవకాశాలు రాలేదు. ఐదేళ్లలో ఈ సుందరి కేవలం ఐదు చిత్రాల్లో మాత్రమే నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇలియానాకు అవకాశాలు పూర్తిగా కరువై పోయాయి. 
 
దీంతో వార్తల్లో నిలిచేందుకు ఈ అమ్మడు సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నది. హాట్‌హాట్ ఫొటోషూట్‌లతో సోషల్‌మీడియాలో దర్శనమిస్తూ కనిపించింది. ఇటీవల బాత్‌రూమ్ కొలనులో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలపై సోషల్‌మీడియాలో అభిమానులు ఘాటుగా స్పందించారు. 
 
సినిమాల్లో సుదీర్ఘకాలంగా ఉన్న ఇలియానాకు ఇలాంటి చవకబారు చేష్టలు తగవని హితవు పలికారు. నెటిజన్ల వ్యాఖ్యలపై ఇలియానా మండిపడింది. తన లైఫ్ తన ఇష్టమని, తాను ఎలా వుండాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని హెచ్చరించింది. తనకు నీతులు చెప్పాలని ఎవరు ప్రయత్నించవొద్దని కోరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళికి షాక్... మహాభారతం చిత్రాన్ని రూ.1000 కోట్లతో ప్రొడ్యూస్ చేస్తానంటూ...