Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నానికి కోపమొచ్చింది, ఆ సినిమాను అలా ఎందుకు చేస్తున్నారంటూ..?

Advertiesment
నానికి కోపమొచ్చింది, ఆ సినిమాను అలా ఎందుకు చేస్తున్నారంటూ..?
, శుక్రవారం, 20 ఆగస్టు 2021 (14:02 IST)
ఏ హీరో అయినా తన సినిమాను థియేటర్లలో ప్రదర్సించాలి.. ప్రేక్షకులు క్యూ కట్టి చూడాలి.. రెస్పాన్స్ బాగా రావాలని అనుకుంటూ ఉంటారు. సినిమా తీసిన నిర్వాహకులందరూ కూడా అదే అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నిర్మాతలు తాము సినిమాకు ఖర్చు పెట్టినదాని కన్నా ఇంకా ఎక్కువగా రావాలని భావిస్తుంటారు.
 
కరోనా సమయం కావడంతో గత కొన్నినెలలుగా థియేటర్లు మూతపడ్డాయి. సుమారుగా మూడునెలల పాటు థియేటర్లు మూతపడ్డాయి. కానీ ఆ తరువాత తెరుచుకున్నాయి కానీ సినిమాలు పెద్దగా లేవు. అడపాదడపా వస్తున్న రెండు, మూడు సినిమాలు మాత్రమే థియేటర్లలో ప్రదర్సితమవుతున్నాయి.
 
ఇప్పటికీ అన్ని థియేటర్లు ఓపెన్ కాలేదు. ఇలాంటి సమయంలో సహజనటుడు నాని నటించిన టక్ జగదీష్‌ను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్థమయ్యారు. ఈనెల 10వ తేదీన ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారట.
 
దీంతో నానికి కోపమొచ్చింది. ఎందుకిలా చేస్తున్నారంటూ నిర్మాతలపై మండిపడ్డారట. హీరోనే కాదు ఎగ్జిబిటర్లు కూడా నిర్మాతల తీరుపై మండిపడుతున్నారట. అదే రోజు థియేటర్లలో లవ్ స్టోరీ సినిమా విడుదల అవుతుంటే థియేటర్లలోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాల్సింది పోయి ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటూ ప్రశ్నించారట.
 
అయితే దీనిపై నాని నోరు విప్పారు. థియేటర్లలో సినిమా విడుదలకే నేను ఇష్టపడతాను. ఓటీటీలో విడుదల చేయడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. నిర్మాతలు మొదటగా థియేటర్లలో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు నాని.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇష్ట‌మైన ల‌క్కీ మ‌స్క‌ట్‌పై ఫోజులిచ్చిన ప్రియాంక‌-నేను ముద్దుగా లేనా!