కమర్షియల్ డేటింగా..? వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా... ఇది మాత్రం నిజం. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో బాలీవుడ్ సెక్సీగాళ్ దీపికా పదుకునే సాగిస్తున్న డేటింగ్ ఇదేనట.
సిద్ధార్థ్ మాల్యాకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టేందుకు దీపికతో విజయ్ మాల్యా ఈ ఒప్పందం చేసుకున్నారట. ఇందులో భాగమే ఈ కమర్షియల్ డేటింగ్ వ్యవహారమట. పబ్లిగ్గా సిద్ధార్థ్‌ను ముద్దుల్తో ముంచెత్తేయటం, కౌగిళ్లలో బంధించడం వంటి చేష్టలు చేయడం ద్వారా తన కుమారుడు నలుగురు కళ్లల్లో పడి పాపులర్ ఫిగర్ కావాలన్నది విజయ్ మాల్యాగారి కోరికట.
ఈ ఒప్పందంలో భాగంగా కొన్నేళ్లపాటు సిద్ధార్థ్‌ను దీపికా అలా ముద్దులు పెట్టుకుంటూ, కౌగిళ్లలో బంధిస్తూనే ఉండాలట. తాము అనుకున్నదానికంటే పబ్లిసిటీ బాగా దొరికితే అదనపు బహుమానాలు కూడా ఇస్తుంటారట. ఇలా వచ్చిన బహుమతులతోనే దీపికా ముంబయిలో 12 కోట్ల రూపాయలతో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందట.
అంతా బాగానే ఉన్నా.. సిద్ధార్థ్ మాల్యాతో దీపికా పదుకునే సాగిస్తున్నది డేటింగ్ కాదనీ, అది కమర్షియల్ డేటింగ్ అనే వార్తలు రావడంపై జనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి డేటింగ్‌లు కూడా ఉంటాయా...? అని నోరెళ్లబెడుతున్నారు. అంతేమరి.. డబ్బిస్తే ఏ డేటింగులుకైనా తారలు రెడీ మరి!!