Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సత్యకృష్ణన్ కోసం "మెంటల్ కృష్ణ" తంటాలు

Advertiesment
మెంటల్ కృష్ణ
WD
పెక్యులర్ గాత్రంతో ఆనంద్ చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన సత్యకృష్ణన్ ఆ తర్వాత పలు చిత్రాల్లో వదిన, అక్క పాత్రలను పోషించింది. హీరోయిన్‌గా నటించాలనే ఆమెకున్న కోరికను పసిగట్టిన కృష్ణమురళి ఆమెను మెంటల్ కృష్ణ చిత్రం ద్వారా హీరోయిన్‌ను చేశాడు. ఆ చిత్రంలో ఆమె కాళ్ల నుంచి పై వరకూ వర్ణించి ఒక రకంగా మేలు చేయబోయి చెడు చేశాడన్న అపకీర్తిని మూటగట్టుకున్నాడు.

ఆ చిత్రం తర్వాత సత్యకృష్ణన్‌కు అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో ఆమె బాధ్యతను పోసాని నెత్తినేసుకున్నట్లు తెలిసింది. ఇండస్ట్రీలో అందరిపైనా విమర్శలు గుప్పించి ఆవేశంగా మాట్లాడే పోసాని ఈ మధ్య చాలా కామ్‌గా కూల్‌గా ఉంటున్నాడు. ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నాక ఆవేశం తగ్గించుకున్నాడని మొదట్లో అనుకున్నా... కారణం అది కాదనీ, సత్యకృష్ణన్‌తో పోసాని కలిసి ఉండటం వల్లే ఈ కూల్‌నెస్ వచ్చిందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.

సత్యకృష్ణన్‌కు పోయిన ఇమేజ్‌ను తెచ్చేందుకు తాను కృషి చేస్తానని పోసాని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈ మధ్య గాలిశీను అనే చిత్రంలో పోసాని రాజకీయనాయకుడిగా నటించాడు. అందులో సత్యకృష్ణన్ కోసం పాత్ర సృష్టించి ఆమెను తీసుకున్నాడు. ప్రస్తుతం జెంటిల్‌మేన్ చిత్రంలో ఆర్తీ అగర్వాల్‌తో నటిస్తున్నాడు. కానీ అందులో సత్యకృష్ణన్ ఉందా... లేదా..? అనేది ఇంతవరకూ తేలలేదు. తాజాగా పోసాని రెండు కథలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందులో సత్యకృష్ణన్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు భోగట్టా.

Share this Story:

Follow Webdunia telugu