Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంతవరకు చూపించాలో నాకు తెలుసు: నీతూ చంద్ర

Advertiesment
బికినీ
అరసైజు బికినీలో అందాలన్నీ ఆరబోస్తూ నీతూ చంద్ర ఇచ్చిన కిక్కుకు బాలీవుడ్ బోర్లా పడి చొంగ కార్చుకుంటోంది. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని తమ సినిమాలలో నటించమని నిర్మాతలు ఆమె వెంటబడుతున్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అడిగినవారికి కాదనకుండా, కనీసం సినిమాలో తను నటించబోయే పాత్ర ఏమిటని అడగకుండా అగ్రిమెంట్ పేపర్లపై తన సంతకాన్ని బరబరలాడించేస్తోందట ఈ బికినీ సుందరి.

నీతూ సంతకం చేసిన సినిమాల్లో రెండు అగ్రశ్రేణి తారలకు చెందినవి కూడా ఉన్నాయట. అందులో ఒకటి అనిల్ కపూర్ నిర్మిస్తున్న చిత్రం. ఆ చిత్రంలో సంజయ్ దత్ సరసన కథానాయికగా నటించనుంది. ఇక మిగిలినవి చిన్నాచితక నిర్మాతలకు చెందినవి.

ఇదంతా గమనించిన ఓ బాలీవుడ్ పిల్ల జర్నలిస్టు, "మీరు నటించే పాత్ర ఎలాంటిదో తెలుసుకోకుండా సంతకం చేసేస్తున్నారు... ఒకవేళ అందులో ఏదైనా వల్గర్ పాత్ర ఉంటేనో...?" అని సందేహాన్ని వెలిబుచ్చాడట.

దానికి నీతూ ఏమాత్రం తడుముకోకుండా, ప్రేక్షకులకు నన్ను ఎలా చూపించాలో దర్శకులకు తెలుసుననీ, అలాగే దర్శకులు తనను ఎంతవరకూ ఉపయోగించుకోగలరో తనకు తెలుసుననీ, ఆపైన తను తన శరీరాన్ని ఎంతవరకూ చూపాలో తన మనసుకు తెలుసునని పిల్ల జర్నలిస్టు బుర్ర వాయించిదట. అంతే... సదరు పిల్ల జర్నలిస్టు ఇక అక్కడుంటే ఒట్టు. పరుగో పరుగు.

Share this Story:

Follow Webdunia telugu