Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'యమలీల-2' స్టోరీ లైన్... రివ్యూ రిపోర్ట్

'యమలీల-2' స్టోరీ లైన్... రివ్యూ రిపోర్ట్
, శుక్రవారం, 28 నవంబరు 2014 (16:40 IST)
యమలీల నటీనటులు: డా|| సతీష్‌, మోహన్‌ బాబు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, గిరిజ, దియా, రావురమేష్‌ తదితరులు; కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్‌వి కృష్ణారెడ్డి, బేనర్‌ క్రిష్వి ఫిలింస్‌, సమర్పణ: అచ్చిరెడ్డి, నిర్మాత: సతీష్‌.
 
ఎస్‌వికృష్ణారెడ్డి చిత్రాలంటే కుటుంబ చిత్రాలనేది తెలిసిందే. చైల్డ్‌ సెంటిమెంట్‌తో రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల వంటి చిత్రాలు తీసిన ఆయన ఈసారి యమలీల-2ను తెరకెక్కించాడు. అయితే ఇటీవల ప్రేక్షకుల ఆలోచనలు కూడా మారాయి. వాటికి కాస్త దూరంగా వున్నా... నిర్మాతే వచ్చి తనతో తీయాలంటే ఒక్కసారి మళ్ళీ మెదడుకు పదునుపెట్టాడు. మరి ఈసారి యమలీల చిత్రాన్ని ఎలా తీశాడో చూద్దాం.
 
కథ :
యమలోకంలో యముడు (మోహన్‌బాబు) గాంధర్వ కన్య పాటలు పాడుతుంటే పరవశిస్తాడు. అది భూలోకంలోని మానస సరోవరం నుంచి వస్తుందని చిత్రగుప్తుడు(బ్రహ్మానందం) చెప్పడంతో కిందకి వస్తారు. వస్తూ భవిష్యవాణి గ్రంథాన్ని తెస్తారు. ఇక వీరిని చూసి గంధర్వ కన్యలు పారిపోతారు. యముడు సరోవరంలో సేదతీరుతానని చెప్పి 10 రోజుల వరకు రాడు. దీంతో బయట వున్న చిత్రగుప్తుడు వుండలేక... నీటిలోకి భవిష్యవాణిని తీసుకెళ్ళలేక అక్కడే వున్న ఒకేఒక్క మానవుడుని పిలిచి గ్రంథాన్ని ఇస్తాడు. దాన్ని తెరవకూడదంటాడు. కానీ ఆ తర్వాత వుండబట్టలేక అతను తెరిచి చూసి భయంభ్రాంతులవుతాడు. కాసేపటికి పైకి వచ్చిన వారికి మానవుడు కన్పించడు. అతనికోసం గాలిస్తూ.. అతన్ని తెలుసుకుని గ్రంథాన్ని ఇవ్వమంటే.. ఓ షరతు పెడతాడు. అది ఏమిటి? అనేది మిగిలిన సినిమా.

Share this Story:

Follow Webdunia telugu