Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాంగోపాల్ వర్మ శృంగార ‘కోరిక’.. నిర్మాత కోసమేనా?

Advertiesment
Tollywood
, సోమవారం, 14 జులై 2014 (12:35 IST)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘XES' పేరుతో హిందీలో శృంగార చిత్రం తీయబోతున్నట్లు ప్రకటించగా, ఈ చిత్రాన్ని తెలుగులోకి కోరిక పేరుతో అనువాదం చేయనున్నారు. తన సినీ కెరీర్లోనే తొలిసారిగా శృంగార చిత్రం తీస్తున్నట్లు వర్మ వెల్లడించారు. ఈ చిత్రానికి తెలుగు నిర్మాత మరెవరో కాదు... తుమ్మలపల్లి రామసత్యనారాయణ. భీమవరం టాకీస్ బేనర్లో ఈ చిత్రం రాబోతోంది. రెండు రోజుల క్రితం విడుదలైన వర్మ ‘ఐస్ క్రీమ్' చిత్రానికి కూడా తుమ్మలపల్లి రామ సత్యనారాయణే నిర్మాత. 
 
‘ఐస్ క్రీమ్' ప్లాప్ టాక్ రావడంతో నిర్మాత నష్టాలు తప్పవనే అంటున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని ఆర్థిక నష్టాల నుండి గట్టెక్కించేందుకే అతనికి తెలుగు ‘కోరిక' చిత్రాన్ని వర్మ అప్పగించినట్లు తెలుస్తోంది. ‘కోరిక' (XES) సినిమా గురించి వర్మ వెల్లడిస్తూ...ఇందులో మనిషి మెదడు ఒక స్థాయిలో ఆలోచిస్తున్నపుడు మనిషి ఒక్కో విధంగా శృంగార జీవితాన్ని అనుభవిస్తాడు. 
 
ఇలా ఆరుగురు వ్యక్తులు ఆరు విధాలుగా ఆలోచిస్తూ చివరికి కథలో కలిసిపోవడమే ఈ చిత్రం అని ఆ ఆరు విధమైన శృంగార స్థితులు ఏమంటే అపరాధం, ద్రోహం, నిస్సహాయత, ఇబ్బంది, బాధ, తాదాత్మ్యం అని వర్మ అన్నారు. ఇప్పటివరకు తను తీసిన సినిమాలకు భిన్నంగా వుంటుందన్నారు. కాగా, కోరిక ఫస్ట్ లుక్‌ను ఆయన తాజాగా విడుదల చేశారు.

Share this Story:

Follow Webdunia telugu