Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జిల్లా కలెక్టర్‌గా, "లింగా"గా రజనీ డబుల్ రోల్!

Advertiesment
జిల్లా కలెక్టర్‌గా,
, బుధవారం, 2 జులై 2014 (16:18 IST)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, అందాల భామ అనుష్క బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్లు నటిస్తోన్న తాజా చిత్రం "లింగా". ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో రామజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది. గతంలో రజనీ నటించిన ముత్తు, నరసింహా వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కేఎస్ రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ "లింగా" సినిమాలో రజనీ డబుల్‌రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. జిల్లా కలెక్టర్‌గా ఓ పాత్ర పోషిస్తున్న రజనీ "లింగా"గా మరో క్యారెక్టర్‌ని కూడా పోషిస్తున్నాడు. ఐతే కీలకమైన లింగా క్యారెక్టర్ మాత్రం సెకండాఫ్‌లో వస్తుందని అంటున్నారు. ఇందులో రజనీకి ధీటుగా జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. దీనికి ఏ ఆర్ రెహేమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని రజనీ పుట్టినరోజు అయిన డిసెంబర్ 12న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

Share this Story:

Follow Webdunia telugu