Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లైంగిక నేరాలను రెచ్చగొట్టే రాధిక ఆప్టే.. అరెస్టు చేయాలని హిందూ మక్కల్ పార్టీ డిమాండ్..!

Advertiesment
radhika apte's nude clip: hindu makkal katchi diamond to arrest
, బుధవారం, 29 ఏప్రియల్ 2015 (17:49 IST)
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో కనిపించే నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లో కొచ్చింది. తాను దర్శకత్వం వహించిన చిత్రంలో రాధికా ఆప్టే నగ్నంగా నటించిన వీడియోని లీక్ చేశారంటూ సినీ దర్శకుడు అనురాగ్ కష్యప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో నటి రాధిక ఆప్టే నగ్నంగా నటించిన వీడియో వాట్స్‌యాప్‌లో హల్‌చల్ చేస్తుందన్నారు. ఆ వీడియో క్లిప్లు తాను దర్శకత్వం వహించిన 20 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్లోనివి అని తెలిపారు.

 
కాగా తాను ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్టు దక్షిణాది నటి రాధికా ఆప్టే ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. తమిళంలో ''ధోని'' చిత్రం ద్వారా ప్రకాష్‌రాజ్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచమైన ఈ భామ ఆ తర్వాత ''ఆలిన్ ఆల్ అళగు రాజ'', ''వెట్రి సెల్వన్'' తదితర చిత్రాల్లో నటించింది. అదే విధంగా తెలుగులో బాలకృష్ణ సరసన ''లెజెండ్‌'' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అదే విధంగా మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాళి పలు భాషల్లో నటించింది.
 
ఈ స్థితిలో నగ్నంగా నటించిన రాధికా ఆప్టేను అరెస్టు చేయాలని హిందూ మున్నని మక్కల్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయమై ఆ పార్టీ చెన్నై మండల కార్యదర్శి వీరమాణిక్యం శివ ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో సినిమాల చిత్రీకరణకు అంటూ ఒక పద్దతి ఉందన్నారు. అందుకోసం ప్రత్యేక సెన్సార్ బోర్డు పనిచేస్తుందని తెలిపారు.
 
సెన్సార్ బోర్డు అధికారులు సూచించిన విధుల ప్రకారమే సినిమాలను రూపొందించాలని తెలిపారు. సెన్సార్ కత్తిరింపుల తర్వాత చిత్రాన్ని బయటకు విడుదల చేయాల్సి ఉందన్నారు. సెన్సార్ బోర్డు విధులను ఉల్లంఘించి ఎవరూ నటించరాదనన్నారు. నగ్నంగా నటించడం అనేది సెన్సార్ విధులను ఉల్లంఘించడమే అవుతుని అభిప్రాయపడ్డారు. 
 
అంతేకాకుండా రాధికా ఆప్టే నగ్నంగా నటించిన వీడియోను సెన్సార్ బోర్డు ముందు ప్రవేశ పెట్టకముందే సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారని ఆరోపించారు.  ఈ వీడియో చిన్నారులను లైంగిక నేరాలకు ప్రోత్సహించే రీతిలో ఉందని, కనుక ఇందులో నటించిన రాధిక ఆప్టే, దర్శకుడు అనురాగ్ కష్యప్‌లను అరెస్టు చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వీరమాణిక్యం శివ హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu