Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోవిందుడు అందరివాడేలే పాటలు 15న: అమ్మలాంటి కమ్మనైన సినిమా

Advertiesment
Govindudu andarivadele Audio
, మంగళవారం, 9 సెప్టెంబరు 2014 (12:52 IST)
రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ సినిమా పాటలు 15న ఆడియో రిలీజ్ కానుంది. అలాగే సినిమా అక్టోబర్ 1న సినిమాను విడుదల కానుంది. 
 
పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి... నిర్మాత మాట్లాడుతూ ‘‘లండన్‌లోని పలు సుందరమైన ప్రదేశాల్లో పాటలను చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 15న పాటలను, అక్టోబర్‌ 1న సినిమాను విడుదల చేస్తాం. సకుటుంబంగా చూసే అచ్చమైన తెలుగు చిత్రమవుతుంది. 
 
అమ్మలాంటి కమ్మనైన సినిమా మా ‘గోవిందుడు అందరివాడేలే’. ప్రతి ఫ్రేమూ అద్భుతంగా ఉంటుంది’’ అని తెలిపారు. శ్రీకాంత్‌, కాజల్‌ అగర్వాల్‌, ప్రకాష్‌రాజ్‌, కమలిని ముఖర్జీ, జయసుధ, ఎం.యస్‌.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu