రామోజీ ఫిలిం సిటిలో వంద అడుగుల ఎత్తున భారీ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. అద్భుతమైన కళానైపుణ్యానికి ప్రతీక అయిన ఆ విగ్రహం ఎవరిదో కాదు.. బాహుబలిది. రాజమౌళి రూపొందిస్తున్న 'బాహుబలి' సినిమా కోసం దీనిని ప్రత్యేకంగా తయారుచేయించారు.
ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ పనితనానికి మచ్చుతునకగా దీనిని చెప్పుకోవచ్చు. ఎంతో వ్యయంతో, ఎంతో సమయాన్ని వెచ్చించి దీనిని లొకేషన్లో ప్రతిష్ఠించారు. 'బాహుబలి' సినిమాలో ఈ విగ్రహం కీలక పాత్ర పోషిస్తుందనీ, దీని బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ దృశ్యాలు చిత్రీకరిస్తున్నామనీ దర్శకుడు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
ఈ స్టాట్యూని ఫ్రేమ్‌లోకి తీసుకుంటూ కెమేరా పొజిషన్ తీసుకోవడానికి యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హేన్స్‌కి నలభై గంటలు పట్టిందట. అయితే, అంతకు మించి ఆ విగ్రహం ఇతర వివరాలను మాత్రం దర్శకుడు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆ విగ్రహం నేపథ్యంలో రాజమౌళి షూటింగ్ చేస్తున్నాడు.