Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిన్న ఆహుతి ప్రసాద్.. నేడు గణేష్ పాత్రో కన్నుమూత!

Advertiesment
Ahuti Prasad passes away at 57
, సోమవారం, 5 జనవరి 2015 (10:03 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక్కొక్కరు తిరిగిరాని లోకాలకు చేరుకుంటున్నారు. కొత్త సంవత్సర సంబరాలు ముగియకముందే.. సినీ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. ఈయన కేన్సర్ బారిన పడటంతో హైదరాబాద్‌లోనే కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. 
 
మరోవైపు సోమవారం తెలుగు సినిమా మాటల రచయిత గణేశ్ పాత్రో కన్నుమూశారు. ఈయన కూడా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన గణేశ్ పాత్రో నాటక రచయితగా సుప్రసిద్ధులు. 
 
పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ చిత్రాలకూ గణేశ్ పాత్రో మాటలు రాశారు. మరో చరిత్ర, రుద్రవీణ, మయూరి, తలంబ్రాలు, మాపల్లెలో గోపాలుడు, సీతారామయ్య గారి మనుమరాలు, తదితర సూపర్ హిట్ చిత్రాలతో పాటు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికీ ఆయన మాటలందించారు. 

Share this Story:

Follow Webdunia telugu