సెప్టెంబర్ 14న ప్రభాస్ 'రెబల్' ఆడియో విడుదల
, సోమవారం, 3 సెప్టెంబరు 2012 (11:31 IST)
'
మిస్టర్ పర్‌ఫెక్ట్'తో సూపర్‌హిట్ కొట్టిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. 'కాంచన'తో సూపర్‌హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్న మాస్ డైరెక్టర్ రాఘవ లారెన్స్. వీరిద్దరి కాంబినేషన్‌లో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రం 'రెబల్'. ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్ 14వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ ''ప్రభాస్, లారెన్స్ కాంబినేషన్‌లో ఉన్నత సాంకేతిక విలువలతో స్టైలిష్ మూవీగా తెరకెక్కుతున్న 'రెబల్' ఆడియోను సెప్టెంబర్ 14న చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. తమ బేనర్‌లోనే కాదు ప్రభాస్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా మిగిలిపోతుందని చెప్పారు. అభిమానులు ప్రభాస్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్‌ని ప్రభాస్ చాలా ఎక్స్‌లెంట్‌గా చేస్తున్నారు. రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రాల స్థాయిలో అద్భుతంగా తీస్తున్నారు. అన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌కు ధీటుగా ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందుతున్న 'రెబల్' చిత్రాన్ని సెప్టెంబర్ నెలాఖరులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈ చిత్రంలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న 'రెబల్' చిత్రానికి మాటలు : డార్లింగ్ స్వామి, ఫోటోగ్రఫీ : సి.రాంప్రసాద్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్ : రామ్‌లక్ష్మణ్, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్ : బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్ : బుజ్జి, కిరణ్, నిర్మాతలు : జె.భగవాన్, జె.పుల్లారావు, కథ - స్క్రీన్‌ప్లే - కొరియోగ్రఫీ - సంగీతం - దర్శకత్వం : రాఘవ లారెన్స్.