Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బ్రహ్మలోకం టు యమలోకం' (వయా భూలోకం) షూటింగ్ పూర్తి!

'బ్రహ్మలోకం టు యమలోకం' (వయా భూలోకం) షూటింగ్ పూర్తి!
WD
డాక్టర్. రాజేంద్రప్రసాద్, శివాజీ కాంబినేషనల్‌లో రూపొందుతున్న చిత్రం "బ్రహ్మలోకం టు యమలోకం (వయా భూలోకం)". లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ (గోపీ), రూపేష్ డి. గోహిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. "అందమైన ఫాంటసీ మిళితమైన చిత్రమిది. డాక్టర్ రాజేంద్రప్రసాద్ బ్రహ్మదేవునిగాను, కళ్యాణి సరస్వతిదేవిగాను, ఆర్తీ అగర్వాల్ రంభగానూ, జయప్రకాశ్ రెడ్డి యమధర్మరాజుగాను ఇందులో కనిపిస్తారు. బ్రహ్మగా రాజేంద్రప్రసాద్‌ను వెండితెరపై అద్భుతంగా చూపిస్తారు. శివాజీ పాత్ర చిత్రణ కనువిందు చేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి" అని తెలిపారు.

నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్ (గోపి), రూపేష్. డి. గోహిల్ మాట్లాడుతూ.."రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ఆ రెండు పాటలను ఏప్రిల్ మొదటివారంలో పుకెట్, బ్యాంకాక్‌ల్లో చిత్రీకరిస్తాం. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం : ఎం.ఎం. శ్రీలేఖ, కెమేరా : వాసు, ఎడిటింగ్ : నాగిరెడ్డి, పాటలు : భాస్కరపట్ల, సహ నిర్మాతలు : కొండ్రు శ్రీనివాస్, కొండవీటి రాజా, సమర్పణ : యుతోపియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్.

Share this Story:

Follow Webdunia telugu