Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"బాడీగార్డ్" రీమేక్‌లో వెంకీతో జతకట్టనున్న త్రిష!

Advertiesment
వెంకటేష్ త్రిష
WD
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నమో వెంకటేశ వంటి బంపర్ హిట్ మూవీల్లో జతకట్టిన విక్టరీ వెంకటేష్-త్రిషలు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సిద్ధిఖీ దర్శకత్వంలో మలయాళంలో హిట్ అయిన బాడీగార్డ్ (2010) రీమేక్‌లో వెంకీ-త్రిషలు మరోసారి జంటగా కన్పించనున్నట్లు సమాచారం.

తమిళంలో "కావలన్" పేరుతో రీమేక్ అవుతున్న ఈ చిత్రంలో విజయ్ మరియు అసిస్ జంటగా నటిస్తుండగా, హిందీ రీమేక్లో సల్మాన్ ఖాన్- కరీనా కపూర్‌లు జోడీగా నటించనున్నారు.

ఇదేవిధంగా తెలుగులో రీమేక్ కానున్న బాడీగార్డ్ చిత్రంలో వెంకీ సరసన త్రిష నటించే అవకాశముందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రాన్ని సి. వెంకటరాజు మరియు శివరాజులు సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలిసింది. కమర్షియల్ హంగులతో రానున్న ఈ చిత్రం.. వెంకీ నాగవల్లి షూటింగ్ పూర్తయ్యాక సెట్స్‌పైకి రానుంది.

Share this Story:

Follow Webdunia telugu