Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనవరి 4న 'వీరంగం' పాటలు విడుదల

Advertiesment
వీరంగం ఆడియో
శివాని ఆర్ట్స్‌ బేనర్‌పై బేబి మమత సమర్పణలో హీరో సుమన్‌, ఆశిష్‌ విద్యార్థి ముఖ్యపాత్రల్లో వేముగంటి దర్శకత్వంలో సి.ఎల్‌.శ్రీనివాస యాదవ్‌ నిర్మిస్తున్న చిత్రం 'వీరంగం'. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాల్లో వుంది. ఈ చిత్రం ఆడియోను జనవరి 4న చిత్ర ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సి.ఎల్‌.శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ - 'నందన్‌రాజ్‌ ఈ చిత్రానికి 5 అద్భుతమైన పాటల్ని అందించారు. శ్రేయ మ్యూజిక్‌ ద్వారా ఈ చిత్రంలోని పాటల్ని చలన చిత్ర మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో జనవరి 4న విడుదల చేయనున్నాము.

ఆడియో సక్సెస్‌ అయి సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం మాకు వుంది. యూనిట్‌ సభ్యులందరీ సహకారంతో అనుకున్న టైంకి ఈ చిత్రాన్ని పూర్తిచేయగలిగాం. సినిమాను జనవరి నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

హీరో సుమన్‌, ఆశిష్‌ విద్యార్థి ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా అక్షయ్‌-సందీప్తి యువజంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బాబూమోహన్‌, గిరిబాబు, ఆర్‌.కె., రమాప్రభ, శివపార్వతి, సాయిప్రియ, జయవాణి, భానుశ్రీ, రమణి, శ్రీనిథి, రోహిణి, బాపణపల్లి పరమేశ్వర్‌, నటరాజ్‌, కార్తికేయన్‌, విజయ్‌, ఉడుతల సారంగపాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి మాటలు: దేశమాల, ఫైట్స్‌: 'సూపర్‌' ఆనంద్‌, ఎడిటర్‌: వి.ఎన్‌. వీరభద్రరావు, కొరియోగ్రఫీ: శివశంకర్‌, కెమెరా: రామ్‌ పినిశెట్టి, మ్యూజిక్‌: నందన్‌రాజ్‌, ప్రొడక్షన్‌ కంట్రోల్‌: రామాంజనేయులు, నిర్మాత: సి.ఎల్‌.శ్రీనివాస యాదవ్‌, కాన్సెప్టె-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వేముగంటి

Share this Story:

Follow Webdunia telugu