క్లైమాక్స్ మినహా థ్రిల్లర్ మూవీ 'మంగళ' షూటింగ్ పూర్తి!
"
మంత్ర" ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఛార్మింగ్ గాళ్ ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం "మంగళ". ఓషో తులసీరామ్ స్వీయదర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న థ్రిల్లర్ "మంగళ".. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో పాటల చిత్రీకరణ జరుపుకుంది. క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి చిత్ర దర్శకనిర్మాత ఓషో తులసీరామ్ మాట్లాడుతూ.. "ఇదొక విభిన్న చిత్రం. ఛార్మి నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గతంలో మా కాంబినేషన్‌లో వచ్చిన 'మంత్ర' ఎంతటి విజయంసాధించింతో, అంతకు మించిన విజయం ఈ 'మంగళ' సాధిస్తుందని ఆశిస్తున్నాను. పాటలతో సహా టాకీ పార్టుతో పాటు షూటింగ్ పూర్తయింది. క్లైమాక్స్ సన్నివేశాలను త్వరలో చిత్రీకరించనున్నాం" అన్నారు.ఛార్మి, ప్రదీప్‌రావత్, సుభాష్, విజయ్‌సాయి, పావల శ్యామల, ఉత్తేజ్, సారికా రామచంద్రరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: జంధ్యం వెంకటేష్‌బాబు, పాటలు: సుద్దాల అశోక్ తేజ, విశ్వ. సంగీతం: విశ్వ, కెమెరా: శివేంద్ర, కో ప్రొడ్యూసర్: బి. నాగేశ్వర్‌రెడ్డి, సమర్పణ: జి. శ్రీధర్, నిర్మాతలు: తులసీరామ్, సీహెచ్‌వీ శర్మ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: తులసీరామ్.