రాజ్యలక్ష్మి ఫిలింస్ పతాకంపై భరత్ పారేపల్లి దర్శకత్వంలో రాంబాబు ఆళ్ళ, గుర్లిన్ చోప్రా ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం "కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య". ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తయింది. మలయాళంలో ఏడాదిపాటు ఆడిన "కరుమాడికుట్టన్" ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
షూటింగ్ మొత్తం కోనసీమలోనే జరిగింది. ఛోటా కె.నాయుడు దగ్గర పనిచేసిన రాంబాబు ఆళ్ల ఈ చిత్రానికి హీరోగా పరిచయమవుతున్నారు. ఒక గ్రామంలో యువరాణిలాంటి అమ్మాయి, మానసికంగా పరిపక్వత చెందని ఓ అబ్బాయి మధ్య సాగే వినూత్నమైన ప్రేమకథే ఈ చిత్రమని నిర్మాత, చిత్ర కథానాయకుడు రాంబాబు వెల్లడించారు. ఇంగ్లాండ్‌కు చెందిన డా. మాదిన రామకృష్ణ ప్రధాన విలన్ పాత్రను పోషిస్తున్నారని ఆయన చెప్పారు.
16 ఏళ్ళ వయస్సు సినిమాలో చంద్రమోహన్ చేసినటువంటి పాత్రను ఇందులో తాను చేశానని, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత తెలిపారు. ఫిబ్రవరి మొదటివారంలో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.
గుర్లిన్ చోప్రా మాట్లాడుతూ... హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, పంజాబీ భాషల్లో నటించడం వల్ల తెలుగులో గ్యాప్ వచ్చిందని చెప్పారు. గుర్తింపు సంపాదించే పాత్రనే ఈ చిత్రంలో పోషించానని చోప్రా వెల్లడించారు. ఇంగ్లాండ్‌లో మానసిక వైద్యుడిగా స్థిరపడిన తాను ఈ చిత్రంలో విలన్‌గా నటించానని ఆయన చెప్పారు.
ఇంకా ఈ చిత్రానికి సంగీతం... లలిత్ సురేష్, సినిమాటోగ్రఫీ... గాదిరాజు శ్రీను, పాటలు... మాస్టర్జీ, సమర్పణ... ఆళ్ళ బ్రదర్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... భరత్ పారేపల్లి.