Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలా కూచోవడమెందుకు..?! అలా చేతులడ్డుపెట్టుకుని తిప్పలెందుకు..?!!

Advertiesment
కాజల్ అగర్వాల్
, మంగళవారం, 15 మే 2012 (15:16 IST)
WD
సెలబ్రెటీలు టాలీవుడ్‌లో కురుచ దుస్తులతో ఆయా ఫంక్షన్లకు రావడం మామూలై పోయింది. అలా పొట్టి దుస్తులతో వచ్చిన తారలు వేదికపై కూచునేందుకు నానా తంటాలు పడటం ఇటీవలి కాలంలో సాధారణమైపోయింది. బాలీవుడ్ తార యానా గుప్తాలాంటివారు లోదుస్తులు వేసుకున్న విషయాన్నే పట్టించుకోకుండా కాలుపై కాలువేసుకుని అలా కూచుని సంచలనం సృష్టించింది. ఇపుడు టాలీవుడ్ నటీమణులు, సెలబ్రెటీలు ఆ దారిలో నడుస్తున్నారా అనే సందేహం కలుగుతోంది.

ఇటీవల టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొడలు వరకూ కనబడే కురుచ దుస్తులు వేసుకుని ఓ కార్యక్రమానికి హాజరైంది. ముందువరుసలో ఆశీనురాలైంది. అసలే గౌను కురుచది కావడం అది కాస్తా పైపైకి లేచిపోవడం మొదలెట్టింది. మరి కెమేరాలు ఊర్కుంటాయా.. పని చెప్పేందుకు వాళ్లు ఎగబడ్డారు. ఇంతలో తన చేతులను అడ్డుపెట్టుకుని కార్యక్రమం ముగిసేవరకూ పాపం కాజల్ అలా బిగుసుకుపోయి కూచున్నదట. అలాంటి దుస్తులు వేసుకోవడం ఎందుకు.. అలా అడ్డం పెట్టుకని కూచోవడం ఎందుకని అక్కడివారు అనుకోవడం కనిపించిందట.

WD

ఇకపోతే ఇటీవల ఓ తార ఓ కార్యక్రమ ప్రారంభం కోసం వచ్చింది. కొబ్బరికాయ కొట్టమనేసరికి వంగి కొట్టేందుకు యత్నించగా, లోనెక్ టాప్ వేసుకోవడంతో ఎద అందాలు దర్శనమిచ్చాయట. దీంతో పూజా కార్యక్రమం మరో రకంగా తయారైందట. ఇలా తారలు ఎక్కడ ఏ దుస్తులు వేసుకోవాలన్న విచక్షణ మరిచి వస్తుండటంతో గ్లామర్ వాసనలు కార్యక్రమాలకు కూడా పట్టుకుని, సంప్రదాయ ఫంక్షన్లలోనూ ఎక్స్ పోజింగ్ తొంగిచూస్తోంది. మరి తారలు తమ వైఖరి మార్చుకుంటారో.. లేదంటే ప్రస్తుత స్థితిని అధిగమించిపోతారో.. చూడాలి.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu