అక్కినేని నాగేశ్వరరావు "ది లెజెండ్": పుట్టినరోజు శుభాకాంక్షలు
, సోమవారం, 19 సెప్టెంబరు 2011 (22:06 IST)
సినిమా హీరోగా 67 వసంతాలు.. నిజ జీవితంలో 87 వసంతాలు, రంగస్థల నటుడిగా 82 వసంతాలు సినీ అగ్రనటుడిగా 71 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగు సినీరంగ ఏకైక నటుడు అక్కినేని నాగేశ్వరావు. ఆయన గురించి అందరికి అన్నీ తెలుసు. అయినా కొత్తగా 'ఏం చెంబుతాం' అని అంటూనే ఎప్పటికప్పుడు కొత్త విషయాలను చెపుతూ ఉంటారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరావు పుట్టినరోజు. మహానటుడు పద్మశ్రీ డాక్టర్ అక్కినేని నాగేశ్వరావు సీని జీవిత విశేషాలు మీ కోసం...అక్కినేని నాగేశ్వరావు 1924 సంవత్సర సెప్టెంబర్ 20న జన్మించారు. ఈ సెప్టెంబరు 20, 2011 నాటికి వారికి 88 సంవత్సరాలు. 80 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రకు నిలువెత్తు ఉదాహరణ నాగేశ్వరరావు జీవన ప్రస్థానం. అందుకే ఆయన విలక్షణకు, క్రమశిక్షణకు ఆదర్శ ప్రాయుడు. క్రమశిక్షణతో కెరీర్ ప్లాన్ చేసుకొంటే ఎలా పెరగవచ్చనే దానికి 'అక్కినేని' జీవితమే గొప్ప ఉదాహరణ.అక్కినేని నాగేశ్వరావు నటించన తొలిచిత్రం 'ధర్మపత్ని' అయినప్పటికీ నటుడిగా జన్మించినది 'సీతారామజననం' చిత్రంతో. ఆ చిత్రంలో అవతార శ్రీరాముడిగా నటించిన అక్కినేని ప్రస్తుతం రూపొందుతున్న 'శ్రీరామరాజ్యం' చిత్రంలో వాల్మీకి పాత్రను పోషించడం ఒక విశేషం. తెలుగు సినిమాతో పాటే తన పేరు ప్రఖ్యాతులను పెంచుకూంటూ వచ్చి చివరకు తెలుగు సినీరంగానికే వాల్మీకి అయ్యారు. 1941 నుండి 2011 వరకు తెలుగులో 30 చిత్రాలు 175 రోజులు ప్రదర్శించబడినవి. నేటి(2011) వరకు ఏ నటుడికి ఇన్ని రజతోత్సవ తెలుగు చిత్రాలు లేవు. ఇక తమిళంలో కూడా అక్కినేని నాగేశ్వరావు నటించిన మూడు చిత్రాలు 175 రోజులు ప్రదర్శించబడినవి. అవి దేవదాసు, ఎంగల్ వీట్టు మగాలక్ష్మీ, కళ్యాణ పరిసు.
అక్కినేని నాగేశ్వరావు నటించన, ప్రతిభా వారి 'బాలరాజు' చిత్రం విజయవాడలో 1948 ఫిబ్రవరి 26న రిలీజై రోజుకు మూడు ఆటలతో 428 రోజులు ప్రదర్శించబడింది. ఈ చిత్రంలా ఆనాడు ఏ చిత్రం ప్రదర్శించబడలేదు. పైగా ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్స్ ఆనాడు ఏ చిత్రం వసూలు చేయలేదు.నాగేశ్వరారావు నటించిన 43వ చిత్రం 'రోజులు మారాయి'. 14-4-1955న రిలీజైన ఈ చిత్రం 17 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అక్కినేని నాగేశ్వరావు నటించన 'ముగ్గురు మరాఠీలు' చిత్రంతో ఈ వేడుకులు జరుపుకోవటం మొదలయింది. '
తొమ్మిది' పాత్రలు ధరించిన ఏకైక నటుడు...తెలుగు చలనచిత్ర రంగంలో అక్కినేని నాగేశ్వరావు మొదటిసారిగా ప్రసాద్ ఆర్ట్పిక్చర్స్ సమర్పణలో విజయచాముండేశ్వరి పిక్చర్స్ (సావిత్రి స్వంత సంస్థ) వారి 'నవరాత్రి' చిత్రంలో తొమ్మిది పాత్రలను పొషించి మెప్పించారు. ఈ చిత్రంలో(1) కోపిష్టి గోపన్న (2) పల్లెటూరు రైతు శాంతన్నగా, (3)కుష్టు రోగి సుందరామయ్య, (4)భాగవతారు శ్రీనివాస్లుగా (5) పోలిస్ ఆఫీసర్ (6) నవ ప్రేమికుడు వేణుగా, (7) డాక్టర్ కరుణాకర్గా (8) దేవదాసుగా (9) ఆనందరావుగా ఇలా ఇందులో తొమ్మిది పాత్రలు పోషించిన ఏకైక తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరావు. 'నవరాత్రి' చిత్రం 22-4-1966న రిలీజైంది.తెలుగులో మొదట ద్విపాత్రాభినయం...అన్నపూర్ణ పిక్చర్స్వారు నిర్మించిన 'ఇద్దరు మిత్రులు' చిత్రంలో మొదటిసారిగా ద్విపాత్రాభినయం గల పాత్రలు ధరించారు. ఈ చిత్రం 29-12-1961న రిలీజై రజతోత్సవం (175 రోజులు) జరుపుకొన్నది.గోల్డెన్ డిస్క్ పొందిన అక్కినేని నటించిన చిత్రాలు...ప్రేమాభిషేకం:- దక్షిణ భారత దేశంలో చలన చిత్ర రంగంలో మొదటగా గ్రామ ఫోన్ రికార్డుల అమ్మకంలో 'గోల్డన్ డిస్క్' పొందిన ఘనత అక్కినేని నటించిన 'ప్రేమాభిషేకం' చిత్రానికి మాత్రమే దక్కింది. ఒక సినిమా రికార్డులు 50 వేలు యూనిట్లు అమ్ముడైతే 'గోల్డన్ డిస్క్' వస్తుంది. గతంలో కన్నడ, మళయాళం భాషలలో కూడా ఏ చిత్రానికి 'గోల్డన్ డిస్క్' రాలేదు. ఈ 'గోల్డన్డిస్క్'' 'సి' రికార్డువారి ద్వారా లభించింది. 'ప్రేమాభిషేకం' చిత్రానికి మాత్రమే అప్పట్లో ఈ 'గోల్డన్ డిస్క్' వచ్చింది.
మేఘసందేశం :- సినిమా విడుదల కాకుండానే 30 వేల గ్రామ పోన్ రికార్డులుగాని క్యాసెట్లు గానీ అమ్ముడు పోవడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ రికార్డు కేవలం అక్కినేని నాగేశ్వరావు నటించిన 200వ చిత్రం 'మేఘసందేశం'కు దక్కింది. లక్ష యూనిట్లు రికార్డుల అమ్మకం 22-9-1982 నాటికి పూర్తి అవగా, యస్.ఇ.ఎ.కంపినీ వారు మద్రాసు సవేరా హోటలలో ఒక సభ జరిపి, తమ డీలర్లును (రికార్డులను, క్యాసెట్లును అమ్మినవారిని) ఘనంగా సన్మానించి అభినందించినారు. అసలు చిత్రం విడుదల కాకముందే 'గోల్డన్ డిస్క్' సాధించిన ప్రప్రథమ తెలుగు మరియు దక్షిణ భారత చలన చిత్రం ఒక్క అక్కినేని నాగేశ్వరావు నటించిన 'మేఘసందేశం' మాత్రమే. ఇప్పటి వరకు (2011) కూడా ఇదే రికార్డు.పూర్తిపేరు: అక్కినేని నాగేశ్వరావుగారుతండ్రిగారుపేరు: అక్కినేని వెంకటరత్నంతల్లిగారి పేరు: అక్కినేని పున్నమ్మపుట్టిన తేది: 20-9-1924పుట్టిన ఊరు: వెంకటరాఘవపురం (గుడివాడ దగ్గర కృష్ణా జిల్లా)అర్థాంగి పేరు: శ్రీమతి అన్నపూర్ణకుమారులు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని కూమార్తెలు: శ్రీమతి సత్యవతి, శ్రీమతి నాగ సుశీల, శ్రీమతి నాగ సరోజనటించిన మొదటి చిత్రం: శ్రీ సీతారామ జననంవిడుదలైన మొదటి చిత్రం: ధర్మపత్ని (10-1-1941)100
వ చిత్రం: గుండమ్మకథ200
వ చిత్రం: మేఘసందేశంహిందీలో నంటించిన ఒకే ఒక చిత్రం: సువర్ణ సుందరితెలుగులో నటించిన చిత్రాలు: 254తమిళంలో నటించిన చిత్రాలు: 11అన్ని భాషలలో నటించన చిత్రాలు: 266 వివాహము జరిగినది: 18-2-1949అన్నపూర్ణ స్టూడియోకు శంకు స్థాపన చేసినది: 13-8-1975స్టూడియో ప్రారంభించింది: 14-1-1976స్టూడియోలో షూటింగ్ జరుపుకున్న మొదటి సినిమా: సురేష్ మూవీస్ వారి సెక్రటరీప్రస్తుతం (2011) నటిస్తున్న చిత్రం: శ్రీరామరాజ్యంజతకట్టిన హిరోయిన్స్: 76