Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తకి దూరంగా వుంటున్నావు... రోజూ నాకదవసరంలేదు, కానీ? మహిళా పైలెట్‌తో...

Advertiesment
భర్తకి దూరంగా వుంటున్నావు... రోజూ నాకదవసరంలేదు, కానీ? మహిళా పైలెట్‌తో...
, బుధవారం, 15 మే 2019 (17:04 IST)
ఎయిర్ ఇండియా సంస్థలో పనిచేసే సీనియర్ కమాండర్ ఒకరు తనను లైంగికంగా వేధించారంటూ మహిళా పైలెట్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈమె హైదరాబాదులో కమాండర్ వద్ద గత కొంతకాలంగా పైలెట్‌గా శిక్షణ తీసుకున్నారు.

శిక్షణా కాలంలో ఎంతో హుందాగా ప్రవర్తించిన కమాండర్ తన శిక్షణ పూర్తయ్యే సమయానికి తేడాగా మాట్లాడారని, లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుపై ఎయిర్ ఇండియా యాజమాన్యం విచారణ చేస్తోంది.
 
కాగా మహిళా పైలెట్ తన ఫిర్యాదులో ఇలా పేర్కొన్నారు. మే నెల 5వ తారీఖున తనకు నోట్స్ ఇస్తానని గదికి రమ్మని పిలిచాడు. ఆ తర్వాత డిన్నర్‌కి వెళదమంటూ ఒత్తిడి చేయడంతో కాదనలేక వెళ్లాను. అక్కడ కమాండర్ నాతో... మీరు కూడా భర్తకు దూరంగా ఉంటున్నారు. రోజూ నాకు లైంగిక సుఖం అవసరం లేదు. హస్తప్రయోగం చేసినా చాలు అని కమాండర్ అభ్యంతరకరంగా మాట్లాడారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
అతని మాటలు విని అక్కడి నుంచి వెళ్లిపోతూ... ఇక ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి అని చెప్పినా తన ఫోనుకి సందేశాలను పంపుతూ వేధించారనీ, తనవద్దకు రాకపోతే తనే తన గదికి వస్తానని బెదిరించినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తను ఎంతగా చెప్పినప్పటికీ వినకపోవడంతో విధిలేని స్థితిలో ఈ ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెన్నూ.. పేపరు ఉందిగా... రాసుకోండి... బీజేపీకి 300 సీట్లు : అమిత్ షా