Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18 కత్తిపోట్లు - మృత్యువును జయించిన ప్రేమోన్మాది బాధితురాలు

Advertiesment
18 కత్తిపోట్లు - మృత్యువును జయించిన ప్రేమోన్మాది బాధితురాలు
, శుక్రవారం, 19 నవంబరు 2021 (12:03 IST)
ఓ ప్రేమోన్మాది బాధితురాలు మృత్యువును జయించింది. ఏకంగా 18 కత్తిపోట్లకు గురైనప్పటికీ ఆమె ప్రాణాలతో బయపడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వారం రోజుల క్రితం హస్తినాపురంలోని ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఓ యువతిపై కత్తితో దాడి చేశారు. ఆ యువతి శరీరంపై ఏకంగా 18 సార్లు కత్తితో పొడిచాడు. ఈ ఘటన నగరంలో సంచలనమైంది. 
 
ఈ క్రమంలో బాధితురాలిని కుటుంబ సభ్యులు స్థానిక హస్తినాపురంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎలాంటి ఆపరేషన్ లేకుండా వైద్యం చేశారు. దీంతో బాధితురాలు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
సాధారణంగా శరీరంపై ఒకటి రెండు కత్తిపోట్లు పడితేనే మృత్యువాతపడతాం. అలాంటిది ఈ యువతి శరీరంపై ఏకంగా 18 కత్తిపోట్లుపడినప్పటికీ ప్రాణాలతో బయటపడటంతో వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లా రేణిగుంటలో వరద బీభత్సం... కూలుతున్న ఇళ్ళు